హైదరాబాద్.. ఇట్స్ డిఫరెంట్ | it's differenet: Afreen speaks about Hyderabad with Sakshi cityplus | Sakshi
Sakshi News home page

హైదరాబాద్.. ఇట్స్ డిఫరెంట్

Oct 10 2014 1:36 AM | Updated on Sep 2 2017 2:35 PM

హైదరాబాద్.. ఇట్స్ డిఫరెంట్

హైదరాబాద్.. ఇట్స్ డిఫరెంట్

ఈ ఇరానీ మహిళ పేరు.. అఫ్రీన్. ఇరాన్‌లోని మెషాద్ మెట్రోపొలిస్ యూత్ వింగ్‌లో వర్క్ చేస్తోంది.

ఈ ఇరానీ మహిళ పేరు.. అఫ్రీన్. ఇరాన్‌లోని మెషాద్ మెట్రోపొలిస్ యూత్ వింగ్‌లో వర్క్ చేస్తోంది. లెవెంత్ మెట్రోపొలిస్‌కి డెలిగేట్‌గా హాజరైంది. హైదరాబాద్ గురించి ఆమె మాటలు...
 
 నేను భారత్‌కు రావడం ఇదే మొదటిసారి. డెఫినెట్లీ హైదరాబాద్ ఈజ్ డిఫరెంట్ సిటీ ఫ్రమ్ మైన్. మాది ఇరాన్‌లోని మెషాద్. ది సెకండ్ బిగ్గెస్ట్ సిటీ ఆఫ్ మై కంట్రీ. మా ఊరి జనాభా ముప్పై లక్షలు. ఇక్కడ మూడింతలు. అయినా నాకు ఈ ఊరు బాగా నచ్చింది. బికాజ్ ఆఫ్ వెదర్. వెరీ కోఆపరేటివ్ పీపుల్. ఇండియన్స్ ఇంత మంచివాళ్లని రియల్లీ ఐ డోంట్‌నో. ఈసారి సైకిల్ మీద ఇండియా యాత్ర చేయాలనుకుంటున్నా. ఇక్కడ చాలా రోజులు గడపాలనుకుంటున్నా. నేను మెషాద్ మెట్రోపొలిస్ యూత్ వింగ్‌లో వర్క్ చేస్తున్నా. వరల్డ్ మెట్రోపొలిస్ కాంగ్రెస్‌కు రావడం ఇదే మొదటిసారి. హైదరాబాద్ మేయర్ మాజిద్ హుస్సేన్‌తో చర్చలు జరిపాం. అభిప్రాయాలను పంచుకున్నాం.  
 
 చాలా బాగుంది...
 చార్మినార్ చూశాను. చాలా బాగుంది. దాని పక్కనున్న మక్కా మసీద్ కూడా చూశా. ఓల్డ్ సిటీకి.. ఈ హైటెక్ సిటీకి చాలా అంతరం ఉందనిపించింది. ఓల్డ్ సిటీ అంతా పావర్టీలో మగ్గుతున్నట్టనిపించింది. దిసీజ్ మై అబ్జర్వేషన్ ఓన్లీ. మళ్లీ వచ్చేటప్పటికి ఈ అనీవెన్ డెవలప్‌మెంట్ ఈవెన్ కావాలని కోరుకుంటున్నాను. అందరికీ ఇళ్లనే లక్ష్యాన్ని ఈ సిటీ సాధించాలని ఆశిస్తున్నా.
 
 మహిళా శక్తి...
 అద్భుతం. ఇక్కడి మహిళల గురించి నేను చాలా విన్నాను. మాతో పోల్చుకుంటే వీరు చాలా ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నారనిపించింది. అయినా ప్రపంచంలోని మిగిలిన మహిళలతో సమానంగా అన్ని రంగాల్లో పోటీపడుతున్నారు. చాలా శక్తిమంతులు. మెట్రోపొలిస్ కాంగ్రెస్‌కి వచ్చిన కొంతమంది భారతీయ మహిళలతో మాట్లాడితే తెలిసింది.. రాత్రి ఎనిమిదయ్యిందంటే ఆడవాళ్లు ఒంటరిగా బయటకు వెళ్లడం అస్సలు క్షేమం కాదు ఈ దేశంలో అని. ఆ మాట వింటే చాలా బాధేసింది. ఇండియా లాంటి కంట్రీలో ఇలాంటి దుస్థితి ఏంటని!

Advertisement
 
Advertisement
Advertisement