తిరిగొచ్చిన పర్సు | Returned pouch | Sakshi
Sakshi News home page

తిరిగొచ్చిన పర్సు

Apr 18 2015 10:46 AM | Updated on Jun 4 2019 6:33 PM

తిరిగొచ్చిన పర్సు - Sakshi

తిరిగొచ్చిన పర్సు

‘‘కలిసొచ్చే కాలం వస్తే రాదా పోయిన సొమ్ము రెట్టింపై’’ అంటూ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయిపోతున్నాడు ఇవికా జెర్కొవిక్ (50).

‘‘కలిసొచ్చే కాలం వస్తే రాదా పోయిన సొమ్ము రెట్టింపై’’ అంటూ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయిపోతున్నాడు ఇవికా జెర్కొవిక్ (50). తూర్పు క్రోషియాలోని ఓ పల్లెటూరిలో నివసించే జెర్కోవిక్ ఒక రోజు మధ్యాహ్నం తన ఇంటి రూఫ్ రిపేర్ నిమిత్తం కొంత సొమ్ము బ్యాంక్ నుంచి డ్రా చేశాడు. అనంతరం ఫ్రెండ్స్‌తో కలిసి  పార్టీలో పాల్గొన్నాడు. అక్కడ ఓ స్నేహితుడు అకస్మాత్తుగా అనారోగ్యం పాలైతే అతడిని ఆసుపత్రిలో చేర్పించాడు. ఇదంతా అయి ఇంటికెళ్లి చూసుకుంటే జేబులోని వాలెట్ కనిపించలేదు. ఎక్కడో పడిపోయిందో, ఎవరైనా కొట్టేశారో అనుకుని బాధపడి ఊరుకున్నాడు. ఇది జరిగి 14 సంవత్సరాలైన తర్వాత జెర్కోవిక్ ఇంటికి ఓ పార్సిల్ వచ్చింది.

అది విప్పి చూస్తే  పోయిన వాలెట్ ఉంది. ఆ వాలెట్‌లో పోయిన సొమ్ముకు రెట్టింపును మించి ఉంది. అయితే  సదరు వాలెట్‌ను ఎవరు పంపారో మాత్రం చిరునామా లేదు. ‘‘అసలు కన్నా వడ్డీ ముద్దు’’అన్నట్టు... ఆ వాలెట్ ‘చోరుడు’ 14 ఏళ్లకు వడ్డీ లెక్కించి మరీ పంపించడంతో ‘‘మంచి దొంగవు నీవు... లెక్కల్లో బ్యాంకర్‌ని మించినావు’’ అంటూ జెర్కోవిక్ తన అజ్ఞాత దొంగ మిత్రుడ్ని పొగడ్తల్లో ముంచెత్తుతున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement