రియల్ హీరో! | Real Hero! | Sakshi
Sakshi News home page

రియల్ హీరో!

Sep 21 2014 11:20 PM | Updated on Sep 2 2017 1:44 PM

రియల్ హీరో!

రియల్ హీరో!

ఎవరైనా ప్రమాదంలో చిక్కుకోగానే హీరో వచ్చి కాపాడేస్తుంటాడు సినిమాల్లో. నిజ జీవితంలో అలా జరుగుతుందా అని ఆశ్చర్యపోతుంటాం మనం.

ఫొటో స్టోరీ
 
ఎవరైనా ప్రమాదంలో చిక్కుకోగానే హీరో వచ్చి కాపాడేస్తుంటాడు సినిమాల్లో. నిజ జీవితంలో అలా జరుగుతుందా అని ఆశ్చర్యపోతుంటాం మనం. కానీ కొన్నిసార్లు అలాంటివి నిజ జీవితంలో కూడా జరుగుతుంటాయి. అందుకు ఉదాహరణే ఈ చిత్రం.
 
1997లో అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో వరదలు సంభవించాయి. శాంటా రోసా నగరం నీట మునిగింది. ఇళ్లు నేలమట్టమయ్యాయి. పెద్ద పెద్ద భవంతులు సైతం కుప్ప కూలాయి. ఉధృతంగా వచ్చి ముంచేసిన వరద నీటిలో చాలామంది చిక్కుకుపోయారు. ఈ ఫొటోలో చూపిస్తున్న అమ్మాయి పరిస్థితి కూడా అదే.
 
సుడులు తిరిగే వరద నీటిలో ఓ చెట్టు ఆధారంగా దొరికింది ఆ అమ్మాయికి. దాన్ని పట్టుకుని, ఎలాగైనా ప్రాణాలు నిలుపుకోవాలని ఆరాటపడిందామె. కానీ ఆమె వల్ల కాలేదు. ఇక మునిగిపోతుంది అనుకున్న సమయంలో రెస్క్యూ టీమ్‌కు చెందిన ఓ అధికారి అక్కడకు వచ్చాడు. వరద నీటికి ఎదురీదుతూ పోయి, ప్రాణాలకు తెగించి ఆ అమ్మాయిని కాపాడాడు.
 
హెలికాప్టర్‌లో పయనిస్తూ వరద బీభత్సాన్ని తన లెన్సులో బంధిస్తోన్న ఫొటోగ్రాఫర్ ఆనీ వెల్స్ ఆ దృశ్యాన్ని ఒడిసిపట్టింది. బ్రేకింగ్ న్యూస్ ఫొటోగ్రఫీ క్యాటగిరీలో ఆ యేడు పులిట్జర్ పురాస్కారాన్ని అందుకుంది!
 

Advertisement
 
Advertisement
Advertisement