ముఖకాంతికి బంగారం | Facial light gold | Sakshi
Sakshi News home page

ముఖకాంతికి బంగారం

Feb 26 2014 10:51 PM | Updated on Sep 2 2017 4:07 AM

ముఖకాంతికి బంగారం

ముఖకాంతికి బంగారం

ముఖ కాంతి పెరగాలంటే ‘గోల్డ్ ఫేసియల్’ మంచి ఎంపిక. ఈ ఫేసియల్ అన్ని చర్మతత్త్వాలకు సరిపడుతుంది. మృతకణాలను తొలగించడంలోనూ...

ముఖ కాంతి పెరగాలంటే ‘గోల్డ్ ఫేసియల్’ మంచి ఎంపిక. ఈ ఫేసియల్ అన్ని చర్మతత్త్వాలకు సరిపడుతుంది. మృతకణాలను తొలగించడంలోనూ, ఎండకు కమిలిన చర్మానికి సహజమైన కాంతి తీసుకురావడంలోనూ, ముడతలను తగ్గించడంలోనూ.. ఇలా చాలా రకాల ప్రయోజనాలను ఇస్తుంది ఈ ఫేసియల్!
 
ఇంట్లోనే ఫేసియల్...

నాణ్యమైన గోల్డ్ ఫేసియల్ కిట్ కొనుగోలు చేయాలి. ఈ కిట్‌లో గోల్డ్ క్లెన్సర్, గోల్డ్ ఫేసియల్ స్క్రబ్, గోల్డ్ ఫేసియల్ క్రీమ్ లేదా జెల్, గోల్డ్ ఫేసియల్ మాస్క్‌లు ఉంటాయి.
 
 క్లెన్స్: ముందుగా ముఖానికి గోల్డ్ క్లెన్సర్‌ను రాసి, మృదువుగా మసాజ్ చేసి, వెచ్చని నీటితో కడిగి, కాటన్ టవల్‌తో తుడుచుకోవాలి.
 
 స్క్రబ్: మృతకణాలను తొలగించడానికి గోల్డ్ స్క్రబ్ సహాయపడుతుంది.


 క్రీమ్: గోల్డ్ క్రీమ్‌ను ముఖానికి, మెడకు రాసి కింద నుంచి పైకి వేళ్లతో స్ట్రోక్స్ ఇస్తూ ఉండాలి. ఈ క్రీమ్.. గోల్డ్ ఫాయిల్, గోల్డ్ పౌడర్, గోధుమ నూనె, కుంకుమపువ్వు, అలొవెరా జెల్, చందనం కలిగి ఉంటుంది. చర్మానికి బాగా ఇంకేలా వేళ్లతో రాసి, తడి క్లాత్‌తో తుడవాలి.
 
 మాస్క్: కిట్‌లోని గోల్డ్ మాస్క్ క్రీమ్ తీసుకొని ముఖానికి, మెడకు రాయాలి. ఇందులో పసుపు, గోల్డ్ ఫాయిల్, అలొవెరా జెల్ ఉంటాయి. ఈ మాస్క్ బాగా ఆరిన తర్వాత చల్లని నీటిని చిలకరించి, శుభ్రపరచాలి.
 
 మాయిశ్చరైజర్: విడిగా నాణ్యమైన మాయిశ్చరైజర్‌ను వేళ్లతో  కొద్దిగా తీసుకొని, ముఖానికి, మెడకు రాసి వలయాకారంగా కదలికలు ఇవ్వాలి.
 
 నోట్:
1. స్క్రబ్ చేసిన తర్వాత ముఖానికి ఆవిరి పట్టడం తగ్గించాలి. ఆవిరికి చర్మం ముడతలు పడే అవకాశం ఉంది.
 
 2. నాణ్యమైన ఉత్పత్తులను వాడితేనే మంచి ఫలితం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement