‘24 క్యారెట్ల’ ముఖసౌందర్యం | 24-carat 'facial beauty | Sakshi
Sakshi News home page

‘24 క్యారెట్ల’ ముఖసౌందర్యం

Nov 30 2014 10:50 PM | Updated on Sep 2 2017 5:24 PM

‘24 క్యారెట్ల’  ముఖసౌందర్యం

‘24 క్యారెట్ల’ ముఖసౌందర్యం

క్యారెట్ ఆరోగ్యానికి ఎంతో మంచిదని తెలుసు. అయితే ఇది అందానికీ ఎంతగా మెరుగులు దిద్దుతుందో తెలుసా?

క్యారెట్ ఆరోగ్యానికి ఎంతో మంచిదని తెలుసు. అయితే ఇది అందానికీ ఎంతగా మెరుగులు దిద్దుతుందో తెలుసా? ‘24 క్యారెట్ల’ బంగారం లాంటి ముఖ సౌందర్యానికి ఏం చేయాలంటే...రెండు క్యారెట్లను మెత్తని పేస్టులా చేసుకుని, అందులో ఐదారు చెంచాల పాలు కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఆరిన తర్వాత ప్యాక్‌ను తీసేసి ముఖానికి ఆవిరి పట్టాలి. కొన్నాళ్లిలా చేస్తే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ పోతాయి.

క్యారెట్ గుజ్జులో కాసింత ముల్తానీ మట్టి, తేనె కలిపి ప్యాక్ వేసుకుంటే... ముఖం కాంతిమంతమవుతుంది. క్యారెట్, కీరా, బంగాళ దుంపల్ని మెత్తని పేస్ట్‌లా చేయాలి. ఇందులో కాసింత టొమాటో రసం, చిటికెడు గంధం కలిపి ముఖానికి పూసుకోవాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేసు కుంటే ముఖం మిలమిలా   మెరుస్తుంది.
 
 

Advertisement
 
Advertisement
Advertisement