బాటిల్‌ షిప్పర్‌లో ఇరుక్కున్న నాలుక | watar botel, taung, problam | Sakshi
Sakshi News home page

బాటిల్‌ షిప్పర్‌లో ఇరుక్కున్న నాలుక

Aug 7 2016 10:54 PM | Updated on Sep 4 2017 8:17 AM

బాలిక నోట్లో నాలుకకు లాక్‌ అయిన వాటర్‌బాటిల్‌ షిప్పర్‌

బాలిక నోట్లో నాలుకకు లాక్‌ అయిన వాటర్‌బాటిల్‌ షిప్పర్‌

పాలలో కలుపుకుని తాగే పేరొందిన ఓ బ్రాండ్‌ పొడి తీసుకుంటే ఉచితంగా వచ్చే వాటర్‌బాటిల్‌ షిప్పర్‌లో నీళ్లు తాగుతూ ఓ బాలిక తన నాలుకను అందులో ఇరికిచ్చుకుంది.

– తీవ్రంగా ఇబ్బంది పడ్డ చిన్నారి
– అత్యంత చాకచక్యంగా తీసేసిన వైద్యుడు

పలమనేరు: పాలలో కలుపుకుని తాగే పేరొందిన ఓ బ్రాండ్‌ పొడి తీసుకుంటే ఉచితంగా వచ్చే వాటర్‌బాటిల్‌ షిప్పర్‌లో నీళ్లు తాగుతూ ఓ బాలిక తన నాలుకను అందులో ఇరికిచ్చుకుంది. ఇబ్బంది పడుతున్న బాలిక నాలుక నుంచి వైద్యుడు చాకచక్యంగా తొలగించాడు. ఈసంఘటన శనివారం సాయంత్రం పలమనేరులో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాలు వైద్యుడు ఆదివారం ‘సాక్షి’కి తెలియజేశారు. పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో రంజిత అనే బాలిక రెండో తరగతి చదువుతోంది. శనివారం బాలిక పాఠశాలకు వెళ్ళేటపుడు తల్లిదండ్రులు వాటిర్‌బాటిల్‌తో షిప్పర్‌ను ఇచ్చిపంపారు. బాలిక షిప్పర్‌తో నీరు తాగుతుండగా నీటిని లాగినపుడు లోని ప్రెషర్‌తో నాలుక షిప్పర్‌లోకి వెళ్లి ఇరుక్కుపోయింది. దీంతో బాటిల్‌ను బాలిక నోట్లోంచి తీసేందుకు ఏమాత్రం వీలుకాకుండా పోయింది. దీంతో సమీపంలోని సాయిరామ్‌ ఆస్పత్రకి తీసుకెళ్లగా డా.యుగంధర్‌ తొలుత బాటిల్‌ను వేరుచేసి ఆపై నాలుకకు మత్తు మందు ఇచ్చి లాక్‌ అయిన షిప్పర్‌ను అత్యంత చాకచక్యంగా వేరుచేశారు. షిప్పర్ల వాడకం ప్రస్తుతం ఫ్యాషన్‌గా మారిందని, దీంతో నీరు ఎలా తాగాలో కూడా లె లియని చిన్నారులకు వీటిని ఇవ్వడం చాలా ప్రమాదమని డాక్టర్‌ యుగంధర్‌ సూచించారు. ఇప్పటికైనా తల్లిదండ్రులు షిప్పర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని  తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement