డొక్కాలో కాంగ్రెస్ వాసన పోలేదు | varla ramaiah dig at dokka manikya varaprasad | Sakshi
Sakshi News home page

డొక్కాలో కాంగ్రెస్ వాసన పోలేదు

Feb 14 2016 10:47 AM | Updated on Aug 20 2018 2:10 PM

డొక్కాలో కాంగ్రెస్ వాసన పోలేదు - Sakshi

డొక్కాలో కాంగ్రెస్ వాసన పోలేదు

మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ టీడీపీలో చేరినా ఇంకా కాంగ్రెస్ సంస్కృతిని వదిలించుకోలేక పోతున్నారని, ఆ వాసన ఆయనలో ఇంకా పోలేదని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థ ఛైర్మన్ వర్ల రామయ్య విమర్శించారు.

గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ వర్ల రామయ్య

సాక్షి, విజయవాడ బ్యూరో: మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ టీడీపీలో చేరినా ఇంకా కాంగ్రెస్ సంస్కృతిని వదిలించుకోలేక పోతున్నారని, ఆ వాసన ఆయనలో ఇంకా పోలేదని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థ ఛైర్మన్ వర్ల రామయ్య విమర్శించారు. శనివారం సీఎం కార్యాలయం వద్ద మీడియా పాయింట్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.

మాదిగలకు కృష్ణమాదిగే నాయకుడని ఆయన వ్యాఖ్యానించడం సరికాదని, దీనిపై పార్టీలో చర్చిస్తామని చెప్పారు. టీడీపీలో ఎలా పనిచేయాలో ఆయన ఇంకా తెలుసుకోవాల్సి ఉందన్నారు.  ఎస్సీ రిజర్వేషన్ల అంశాన్ని చంద్రబాబు చూసుకుంటారని దానిపై కృష్ణమాదిగ తమకు చెప్పాల్సిన పనిలేదన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement