ఘనంగా ఉరుసు మహోత్సవం | urusu mahothsavam in darga honnur | Sakshi
Sakshi News home page

ఘనంగా ఉరుసు మహోత్సవం

Feb 16 2017 11:19 PM | Updated on Aug 24 2018 6:44 PM

ఘనంగా ఉరుసు మహోత్సవం - Sakshi

ఘనంగా ఉరుసు మహోత్సవం

మండలంలోని దర్గాహోన్నూరు గ్రామంలో ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రమైన సయ్యద్‌షా ఖాజా, సయ్యద్‌ షా సూఫి సర్మస్‌, హుసేన్‌ చిఫ్తి వారి ఉరుసు మహోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు.

బొమ్మనహాళ్‌ : మండలంలోని దర్గాహోన్నూరు గ్రామంలో ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రమైన సయ్యద్‌షా ఖాజా, సయ్యద్‌ షా సూఫి సర్మస్‌, హుసేన్‌ చిఫ్తి వారి ఉరుసు మహోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గాలో ఫాతెషా ఆరాధన చేపట్టారు. అనంతరం స్వామివారికి భక్తులు చక్కెర, బెల్లం, గోధుమలను తులాభారంగా ఇచ్చి మొక్కులు తీర్చుకున్నారు. బొమ్మనహాళ్‌ , కణేకల్‌ ఎస్‌ఐలు ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు నిర్వహించారు. భక్తులకు ఉచిత వైద్యం, తాగునీరు సౌకర్యం కల్పించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement