నేడు టీఎస్ లాసెట్ ఫలితాలు | TS lawset results today | Sakshi
Sakshi News home page

నేడు టీఎస్ లాసెట్ ఫలితాలు

Jun 6 2016 12:13 AM | Updated on Apr 7 2019 3:35 PM

ఎల్‌ఎల్‌బీ మూడేళ్ల, ఐదేళ్ల, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం గత నెల 24న నిర్వహించిన టీఎస్ లాసెట్ ఫలితాలు

కేయూ క్యాంపస్: ఎల్‌ఎల్‌బీ మూడేళ్ల, ఐదేళ్ల, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం గత నెల 24న నిర్వహించిన టీఎస్ లాసెట్ ఫలితాలు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విడుదల చేయనున్నట్లు లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎం.వి.రంగారావు ఆదివారం వెల్లడించారు. ఎల్‌ఎల్‌బీ మూడేళ్ల ప్రవేశ పరీక్షకు 11,750 మంది, ఐదేళ్ల కోర్సుకు 3,562 మంది, ఎల్‌ఎల్‌ఎం ప్రవేశ పరీక్షకు 1,629 మంది అభ్యర్థులు హాజరయ్యూరని పేర్కొన్నారు.

గత నెల 26న ప్రాథమిక కీ విడుదల చేసి, 30 వరకు అభ్యంతరాలు స్వీకరించామని తెలిపారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి, కేయూ ఇన్‌చార్జి వీసీ టి.చిరంజీవులు ఈ ఫలితాలను విడుదల చేస్తారని రంగారావు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement