నేటినుంచి దర్వేష్‌ అలీ ఉర్సు | Today start Darwesg Ali Ursu | Sakshi
Sakshi News home page

నేటినుంచి దర్వేష్‌ అలీ ఉర్సు

Jul 24 2016 7:38 PM | Updated on Aug 24 2018 6:44 PM

ధరూరులోని దర్వేష్‌అలీ దర్గా - Sakshi

ధరూరులోని దర్వేష్‌అలీ దర్గా

ధరూరు : మండల కేంద్రంలోని దర్వేష్‌అలీ దర్గా ఉర్సు ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. హిందూముస్లింలు కలిసి జరుపుకొనే ఉర్సు ఉత్సవాలు సోమవారం గంధంతో ప్రారంభమవుతాయి.

ధరూరు : మండల కేంద్రంలోని దర్వేష్‌అలీ దర్గా ఉర్సు ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. హిందూముస్లింలు కలిసి జరుపుకొనే ఉర్సు ఉత్సవాలు సోమవారం గంధంతో ప్రారంభమవుతాయి. ఇప్పటికే దర్గా వద్ద ఏర్పాట్లను మత పెద్దలు ముమ్మరం చేశారు. ఏటా జరిగే ఈ ఉత్సవాలకు జిల్లాలోని ఆయా ప్రాంతాలతోపాటు ఏపీలోని కర్నూలు, అనంతపురం, పుణె, మహారాష్ట్ర, ముంబాయి ప్రాంతాల నుంచి భక్తులు దర్గాకు అధిక సంఖ్యలో తరలివస్తారు. ఇందుకనుగుణంగా దర్గాలో ఏర్పాట్లను చేస్తున్నారు. మంగళవారం ఉర్సు ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. బుధవారం సైతం ఉత్సవాలను నిర్వహించి గురువారంతో ముగించనున్నట్లు నిర్వాహకులు వాహబ్‌సాబ్, దర్వేష్‌అలీ తెలిపారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement