విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికితీయాలి | Sakshi
Sakshi News home page

విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికితీయాలి

Published Sat, Aug 27 2016 12:36 AM

Students, unleash creativity

స్టేషన్‌ఘన్‌పూర్‌టౌన్‌ :  వి ద్యార్థుల్లో దాగి ఉన్న సృజ నాత్మకతను వెలికి తీస్తూ సైన్స్‌పట్ల అవగాహన పెం పొందించాలని జిల్లా విద్యాశాఖ అధికారి పి.రాజీవ్‌ సూచించారు. మండలంలోని శివునిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జనగామ డివిజన్‌ స్థాయి ఇన్‌సె్పౖర్‌ ఓరియంటేషన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీఈఓ ఎస్‌.యాదయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో డీఈఓ మాట్లాడుతూ.. ప్రతివిద్యార్థి సాంకేతికనిపుణుడిగా తయారై కొత్త అధ్యయనాలు సృష్టించాలన్నారు.
 
జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పేద వర్గాల పిల్లలు చదువుతున్నారని, వారిలో శాస్త్రీయ దృక్పథాన్ని పెం పొందించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. శాస్త్ర సాంకేతికరంగాల లో, విజ్ఙాన శాస్త్రంలో విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. సెప్టెంబర్‌ 19, 20, 21 తేదీ లలో హన్మకొండలో జిల్లా స్థాయి ఇన్‌సె్పౖర్‌ కార్యక్రమం ఉంటుందని, డివిజన్‌ స్థాయి లో ఎంపికైన విద్యార్థులు, గైడ్‌ టీచర్లు హా జరు కావాలని తెలిపారు. సమావేశంలో ప్రొ ఫెసర్లు రామచంద్రయ్య, రాములు, ఆంజ నేయులు, ఎంఈఓ లక్ష్మయ్య పాల్గొన్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement