27న వైవీయూలో స్పాట్‌ అడ్మిషన్లు | spot Admission to theb yvu on 27th | Sakshi
Sakshi News home page

27న వైవీయూలో స్పాట్‌ అడ్మిషన్లు

Jul 25 2016 10:37 PM | Updated on Sep 4 2017 6:14 AM

27న వైవీయూలో స్పాట్‌ అడ్మిషన్లు

27న వైవీయూలో స్పాట్‌ అడ్మిషన్లు

యోగివేమన విశ్వవిద్యాలయం, అనుబంధ కళాశాలల్లో మిగిలిన సీట్లకు ఈనెల 27న స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు వైవీయూ ప్రవేశాల సంచాలకుడు ఆచార్య ఎస్‌. రఘునాథరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

వైవీయూ :
యోగివేమన విశ్వవిద్యాలయం, అనుబంధ కళాశాలల్లో మిగిలిన సీట్లకు ఈనెల 27న స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు వైవీయూ ప్రవేశాల సంచాలకుడు ఆచార్య ఎస్‌. రఘునాథరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వైవీయూసెట్‌–2016లో ర్యాంకు వచ్చి సీటు రాని అభ్యర్థులు మరియు ప్రవేశ పరీక్ష రాయని అభ్యర్థులు కూడా స్పాట్‌ అడ్మిషన్లకు హాజరుకావచ్చని తెలిపారు. హాజరయ్యే అభ్యర్థులు నిర్ణీత కోర్సు ఫీజు, ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, రెండు జతల జిరాక్స్‌ సర్టిఫికెట్లు వెంట తీసుకురావాలని సూచించారు. వివిధ కళాశాలల్లోని ఖాళీగా ఉన్న సీట్లకు సంబంధించిన వివరాలను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.వైవీయూడీఓఏ.ఇన్‌ అనే వెబ్‌సైట్‌లో సంప్రదించాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement