గుప్తనిధుల కోసం క్షుద్రపూజలు | special prays and hunting for guptanidhulu in chittoor district | Sakshi
Sakshi News home page

గుప్తనిధుల కోసం క్షుద్రపూజలు

Oct 9 2015 9:36 AM | Updated on Sep 3 2017 10:41 AM

గుప్తనిధుల కోసం క్షుద్రపూజలు

గుప్తనిధుల కోసం క్షుద్రపూజలు

గుప్త నిధులు లభిస్తాయని కొందరు వ్యక్తులు పురాతన ఆలయం సమీపంలో క్షుద్రపూజలు నిర్వహించారు.

శ్రీకాళహస్తి(చిత్తూరు): గుప్త నిధులు లభిస్తాయని కొందరు వ్యక్తులు పురాతన ఆలయం సమీపంలో క్షుద్రపూజలు నిర్వహించారు. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ సంఘటన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి లోని రాజీవ్‌నగర్ కైలాసగిరి కొండల్లో గురువారం రాత్రి జరిగింది. వివరాలు.. స్థానిక పనసకోనలో ఉన్న పురాతన శివలింగాల సమీపంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు నిర్వహించి తవ్వకాలు జరుపుతున్నారు.

ఇది గుర్తించిన స్థానికులు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు పోలీసులతో సహా సంఘటనా స్థలానికి చెరుకుని విచారణ చేపడుతున్నారు. కాగా.. రెండు రోజులుగా తమిళనాడుకు చెందిన కొందరు వ్యక్తులు ఆ ప్రాంతంలో తిరిగారని స్థానికులు అంటున్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement