ఎస్కేయూ రీసెట్‌ ఫలితాలు విడుదల | sku rescet results release | Sakshi
Sakshi News home page

ఎస్కేయూ రీసెట్‌ ఫలితాలు విడుదల

Apr 15 2017 11:52 PM | Updated on Nov 6 2018 5:13 PM

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్యాంపస్‌ కళాశాలల్లో ఎంఫిల్, పీహెచ్‌డీ ప్రవేశాలకు నిర్వహించిన రీసెట్‌–2016 ఫలితాలు శనివారం విడుదల చేశారు.

ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్యాంపస్‌ కళాశాలల్లో ఎంఫిల్, పీహెచ్‌డీ ప్రవేశాలకు నిర్వహించిన రీసెట్‌–2016 ఫలితాలు శనివారం విడుదల చేశారు. ఎస్కేయూలో వీసీ ఆచార్య కె.రాజగోపాల్, రెక్టార్‌ ఆచార్య హెచ్‌.లజిపతిరాయ్, రిజిస్ట్రార్‌ ఆచార్య కె.సుధాకర్‌బాబు, ఆర్‌అండ్‌డీ డీన్‌ ఆచార్య చింతా సుధాకర్‌ ఫలితాలను విడుదల చేశారు. వీసీ మాట్లాడుతూ రాష్ట్రంలోనే ప్రప్రథమంగా ఆన్‌లైన్‌ విధానంలో రీసెట్‌ నిర్వహించిన ఘనత ఎస్కేయూకు దక్కిందన్నారు. మొత్తం 2,560 మంది దరఖాస్తు చేసుకోగా, 1,646 మంది పరీక్ష రాశారని తెలిపారు. వీరిలో 856 మంది అర్హత సాధించారన్నారు. కార్యక్రమంలో క్యాంపస్‌ కళాశాలల ప్రిన్సిపాళ్లు ఆచార్య సీఎన్‌ కృష్ణానాయక్, ఆచార్య వి.రంగస్వామి, పీఆర్వో డాక్టర్‌ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement