సురక్షిత డ్రైవింగ్‌తో ప్రమాదాలు దూరం | Safe driving distance of accidents | Sakshi
Sakshi News home page

సురక్షిత డ్రైవింగ్‌తో ప్రమాదాలు దూరం

Jul 29 2016 11:35 PM | Updated on Sep 4 2017 6:57 AM

సురక్షిత డ్రైవింగ్‌తో ప్రమాదాలు దూరం

సురక్షిత డ్రైవింగ్‌తో ప్రమాదాలు దూరం

సురక్షిత డ్రైవింగ్‌తో ప్రమాదాలు దూరమవుతాయని ఆర్టీసీ కరీం నగర్‌ జోన్‌ ఈడీ గరిమిల్ల సత్యనారాయణ అన్నారు. శుక్రవారం వరంగల్‌ ములుగు రోడ్డులోని ఆర్టీసీ జోనల్‌ స్టాఫ్‌ శిక్షణ కాలే జీలో ప్రమాద రహిత వారోత్సవాలను పురస్కరించుకుని శిక్షణ కార్యక్రమం జరిగింది.

హన్మకొండ : సురక్షిత డ్రైవింగ్‌తో ప్రమా దాలు దూరమవుతాయని ఆర్టీసీ కరీం నగర్‌ జోన్‌ ఈడీ గరిమిల్ల సత్యనారాయణ అన్నారు. శుక్రవారం వరంగల్‌ ములుగు రోడ్డులోని ఆర్టీసీ జోనల్‌ స్టాఫ్‌ శిక్షణ కాలే జీలో ప్రమాద రహిత వారోత్సవాలను పురస్కరించుకుని శిక్షణ కార్యక్రమం జరి గింది. ఈ కార్యక్రమంలో ఈడీ పాల్గొని మాట్లాడుతూ ఆర్టీసీ అంటేనే సురక్షిత ప్ర యాణమని ప్రజల్లో నమ్మకం ఉందన్నారు. ఈ నమ్మకాన్ని నిలుపుకునేల డ్రైవర్లు జాగ్ర త్తగా బస్సు నడుపాలన్నారు. ప్రయా ణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చా లన్నారు. ప్రధానంగా వర్షాకాలంలో డ్రైవర్లు జాగ్రత్తగా బస్సు నడుపాలన్నారు.  కార్యక్రమంలో ఆర్టీసీ వరంగల్‌ ఇంచార్జీ ఆర్‌ఎంజీ.ఎస్‌.ఎస్‌.సురేష్, డిప్యూటీ సీఎం ఈ జి.రాములు, ప్రిన్సిపాల్‌ వీర్ల బాస్క ర్‌రావు, సూపర్‌వైజర్‌ బిక్షపతి, డ్రైవింగ్‌ ఇన్స్‌స్ట్రక్టర్‌ రాజు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement