ఎర్ర చక్కెర కేళి ధర పతనం | red banana prise less | Sakshi
Sakshi News home page

ఎర్ర చక్కెర కేళి ధర పతనం

Aug 29 2016 10:59 PM | Updated on Sep 4 2017 11:26 AM

ఎర్ర చక్కెర కేళి ధర పతనం

ఎర్ర చక్కెర కేళి ధర పతనం

శ్రావణమాసం అన్ని అరటి రకాలకు కలిసొస్తే ఒక్క ఎర్ర చక్కెరకేళి అరటికి మాత్రం గడ్డుకాలం ఎదురైంది. రావులపాలెం అరటి మార్కెట్‌ యార్డులో నిన్నమొన్నటి వరకూ మిగిలిన రకాలతోపాటు అధిక ధర పలికిన ఈ రకం అరటి ప్రస్తుతం ధర దిగజారడంతో ఆ రైతుల్లో ఆవేదన వ్యక్తం అవుతోంది. సుమారు వారం రోజుల క్రితం వరకూ ఈ రకం గెల ఒకటి సైజును బట్టి రూ.250 నుంచి రూ.600 వరకు పలకగా నేడు రూ.150 నుంచి రూ.350కు పడిపోయింది. ఇక్కడ నుంచి ఈ రకం గెల

రావులపాలెం :
శ్రావణమాసం అన్ని అరటి రకాలకు కలిసొస్తే ఒక్క ఎర్ర చక్కెరకేళి అరటికి మాత్రం గడ్డుకాలం ఎదురైంది. రావులపాలెం అరటి మార్కెట్‌ యార్డులో నిన్నమొన్నటి వరకూ మిగిలిన రకాలతోపాటు అధిక ధర పలికిన ఈ రకం అరటి ప్రస్తుతం ధర దిగజారడంతో ఆ రైతుల్లో ఆవేదన వ్యక్తం అవుతోంది. సుమారు వారం రోజుల క్రితం వరకూ ఈ రకం గెల ఒకటి సైజును బట్టి రూ.250 నుంచి రూ.600 వరకు పలకగా నేడు రూ.150 నుంచి రూ.350కు పడిపోయింది. ఇక్కడ నుంచి ఈ రకం గెలలు ఎక్కువగా తమిళనాడులోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతుంటాయి. అయితే ఆ రాష్ట్రంలో ఈ రకం పండించే తిరుచునాపల్లి తదితర ప్రాంతాల్లో ప్రస్తుతం పంట పుష్కలంగా అందిరావడంతో ఇక్కడ గెలలకు డిమాండ్‌ తగ్గింది. దీంతో సాధారణంగానే ధర తగ్గింది. గతంలో మిగిలిన రకాల అరటి ధరలు ఏ విధంగా ఉన్నా ఎర్ర చక్కెరకేళి ధరలు అధికంగానే పలికేవి. అయితే చిత్రంగా ప్రస్తుతం అన్ని రకాల ధరలు జోరుమీద ఉండగా ఎర్ర చక్కెరకేళి మాత్రం తిరోగమనం పట్టడం ఆ రకం పండిచిన రైతుల్లో నిరుత్సాహం కలిగిస్తోంది. మిగిలిన రకాలు పండించిన రైతులు లాభాలు చవిచూస్తుంటే ఎర్ర చెక్కరకేళి రైతులకు పెట్టుబడులు మాత్రం వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 

Advertisement

పోల్

Advertisement