ప్రియుడు బెదిరింపులు... లెక్చరర్ ఆత్మహత్య | pg lecturer suicide in warangal district | Sakshi
Sakshi News home page

ప్రియుడు బెదిరింపులు... లెక్చరర్ ఆత్మహత్య

Apr 2 2016 9:20 AM | Updated on Nov 6 2018 7:56 PM

వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లిలో దారుణం చోటు చేసుకుంది.

వరంగల్ : వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లిలో దారుణం చోటు చేసుకుంది. పీజీ లెక్చరర్గా పని చేస్తున్న మమతా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. నాలుగేళ్లుగా మమతతో ప్రేమాయణం సాగించిన డాక్టర్ వెంకటరమణ... నిశ్చితార్థం జరిగాక కట్నం కోసం వేధించాడంటూ బంధువులు ఆరోపించారు. ఈ క్రమంలో తాను మరో పెళ్లి చేసుకుంటానని మమతను వెంకటరమణ బెదిరించాడు. దీంతో తీవ్ర ఆందోళన చెందిన మమత ఆత్మహత్య చేసుకుందని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement