చాటుమాటున ఎన్నాళ్లీ పాట్లు | negligence in letrins sanction | Sakshi
Sakshi News home page

చాటుమాటున ఎన్నాళ్లీ పాట్లు

Aug 27 2016 10:01 PM | Updated on Sep 4 2017 11:10 AM

చీరలతో నిర్మించుకున్న మరుగుదొడ్లు

చీరలతో నిర్మించుకున్న మరుగుదొడ్లు

వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోమని ఊదరగొడతారు. నిర్మించుకుంటాం మహాప్రభో అంటే మంజూరు చేయరు. ఫలితంగా స్వచ్ఛభారత్‌ నినాదాలకే పరిమితమైంది. వెంకటాపురంలో వ్యక్తిగత మరుగుదొడ్లు లేక దడి కట్టి.. పాతచీరలు చుట్టి మరుగుదొడ్లుగా వినియోగిస్తున్నారు. రాష్ట్రీయరహదారికి కూతవేటు దూరంలో వెంకటాపురంలో సుమారు 135 కుటుంబాలున్నాయి.

మంజూరవని వ్యక్తిగత మరుగుదొడ్లు
దరఖాస్తులకు నేటికీ మోక్షం లేదు
నిర్మించిన వారికి బిల్లుల్లేవు
వెంకటాపురం గ్రామస్తుల ఆవేదన
 
సీతానగరం: వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోమని ఊదరగొడతారు. నిర్మించుకుంటాం మహాప్రభో అంటే మంజూరు చేయరు. ఫలితంగా
స్వచ్ఛభారత్‌ నినాదాలకే పరిమితమైంది. వెంకటాపురంలో వ్యక్తిగత మరుగుదొడ్లు లేక దడి కట్టి.. పాతచీరలు చుట్టి మరుగుదొడ్లుగా వినియోగిస్తున్నారు. రాష్ట్రీయరహదారికి కూతవేటు దూరంలో వెంకటాపురంలో సుమారు 135 కుటుంబాలున్నాయి. వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేయాలని గ్రామసభలకు వచ్చిన అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని గ్రామస్తులు వాపోయారు. మరుగుదొడ్లు లేక వెదురు కర్రలతో దడి కట్టి పాతచీరలు చుట్టి మరుగుదొడ్లుగా వినియోగించుకుంటున్నామని తెలిపారు. గత ఏడాది మరుగుదొడ్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణం పూర్తి చేసినా సగం బిల్లులు చెల్లించారంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేయాలని, నిర్మాణాలు పూర్తి చేసిన వారికి పూర్తి బిల్లులు చెల్లించాలని కోరుతున్నారు. 
 
అప్పు చేసి నిర్మించా:  జె.రాము
అప్పు చేసి మరుగుదొడ్డి నిర్మించుకున్నాను. నిర్మాణాన్ని పూర్తి చేసిన వెంటనే బిల్లు చెల్లిస్తామనడంతో అప్పు చేసి కట్టించుకున్నాను. ఇప్పటికీ బల్లు అందలేదు. తక్షణమే బిల్లులు చెల్లించాలి. 
 
 
బిల్లు చెల్లించక ఆర్థిక ఇబ్బందులు:  వై.భాస్కరరావు, అంటిపేట
మాకు వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరవకపోవడంతో ఇబ్బంది పడుతున్నాం. కొందరికి బిల్లులు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే మంజూరు చేయాలి.
 
 
దరఖాస్తులు పరిశీలిస్తాం: జి.పైడితల్లి, ఎంపీడీవో, సీతానగరం
మండలంలో మరుగుదొడ్ల మంజూరుకు సిద్ధంగా ఉన్నాం. వెంకటాపురంలో  వ్యక్తిగత మరుగుదొడ్లు కావాలని వచ్చి దరఖాస్తులను పరిశీలించాకSమంజూరుచేస్తాం. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement