24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో మోస్తరు వర్షాలు | More rains in andhra pradesh within 24 hours | Sakshi
Sakshi News home page

24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో మోస్తరు వర్షాలు

Aug 22 2015 1:46 PM | Updated on Sep 3 2017 7:56 AM

24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

విశాఖపట్నం : 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఆవరించి ఉందని తెలిపింది. రుతుపవనాల వల్ల రాయలసీమ, ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయని పేర్కొంది.

పశ్చిమ బెంగాల్ పరిసర ప్రాంతాల్లో 3.1 కిలోమీటర్ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని చెప్పింది. రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement