పవిత్ర యాత్ర మక్కా | makka holey tour | Sakshi
Sakshi News home page

పవిత్ర యాత్ర మక్కా

Nov 13 2016 11:28 PM | Updated on Sep 4 2017 8:01 PM

పవిత్ర యాత్ర మక్కా

పవిత్ర యాత్ర మక్కా

మక్కా.. పవిత్రయాత్ర అని జిల్లా హజ్‌ కమిటీ అధ్యక్షుడు నూర్‌అహ్మద్‌ ఖాన్‌ పేర్కొన్నారు

కర్నూలు (ఓల్డ్‌సిటీ): మక్కా.. పవిత్రయాత్ర అని జిల్లా హజ్‌ కమిటీ అధ్యక్షుడు నూర్‌అహ్మద్‌ ఖాన్‌ పేర్కొన్నారు. అల్‌హరమైన్‌ హజ్, ఉమ్రా టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఉమ్రా యాత్రికులకు స్థానిక పెద్ద మార్కెట్‌ సమీపంలోని ఉర్దూ ఘర్‌లో శిక్షణ తరగతులు నిర్వహించారు.  నూర్‌ అహ్మద్‌ ఖాన్‌తో పాటు నాయబ్‌ ఖాజీ సలీం అతిథులుగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్థిక స్థోమత కలిగిన ప్రతి ముస్లిం జీవితంలో ఒక్కసారైనా హజ్‌కు వెళ్లాలని చెప్పారు. ఆ తర్వాత ఉమ్రా యాత్ర చేయాలన్నారు. సంస్థ ఎండీ ఎం.ఎ.ఆసిఫ్‌పాషా, సభ్యుడు ఎం.ఎ.ఆరిఫ్‌  మాట్లాడుతూ 49 మంది యాత్రికులతో ఈనెల 20వ తేదీ ఉదయం 10.30 గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి ఫ్లైట్‌ బయలుదేరనున్నట్లు తెలిపారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement