• బాలింత, కవల పిల్లలను వదిలి వెళ్లిన భర్త
• పూట గడవని స్థితిలో బాధితురాలు
• ప్రాణాపాయ స్థితిలో చిన్నారులు
• పట్టించుకోని కుటుంబసభ్యులు
మాయమై పోతున్నడమ్మా.. మనిషన్నవాడు.. మచ్చుకైన లేడు చూడు మానవత్వం ఉన్నవాడు.. అన్న ఓ కవి గేయానికి.. అద్దం పడుతోంది ధర్మవరంలోని ఓ బాలింత రాలి దీనస్థితి. కట్టుకున్న వాడు కఠినాత్ముడై.. పచ్చి బాలింతరాలైన ఇల్లాలిని, పుట్టిన కవలలను వదిలి వెళ్లిపోతే ఒక్కపూట తిండికోసం ఆ అభాగ్యురాలు నానా ఇబ్బందులు పడుతోంది. తీవ్ర రక్తహీనతతో బాధపడుతున్న ఆమెకు... పిల్లల ప్రాణాపాయ స్థితి తీరని వ్యధనే మిగుల్చుతోంది. జీవిత కాలం తోడుంటానన్న భర్త... కుటుంబ పోషణకు భయపడి నిర్ధయగా తనదారి తాను చూసుకోవడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. కష్టకాలంలో ఆదుకోవాల్సిన కుటుంబసభ్యులు కూడా ముందుకు రాకపోవడంతో నిస్సహాయురాలిగా మిగిలిపోయింది.
కోటి ఆశలతో కొత్త జీవితంలోకి...
ధర్మవరంలోని పీఆర్టీ వీధికి చెందిన సరస్వతి, చంద్రశేఖర్ దంపతుల కుమార్తె నీలిమ. పదో తరగతి వరకు చదువుకున్న నీలిమాకు.. ధర్మవరం రైల్వేస్టేషన్లో క్యాటరింగ్ పనులు చేస్తున్న మునికష్ణతో దాదాపు 18 నెలల క్రితం పెళ్లి జరిగింది. అనంతరం ధర్మవరంలోని కొత్తపేటలో ఓ అద్దె ఇంటిలో నూతన దంపతులు కాపురం పెట్టారు. కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన నీలిమాకు... అడుగడుగునా కష్టాలు మొదలయ్యాయి.
వేధింపులు... శాపనార్థాలు
భర్తతో కలిసి నీలిమ జీవించింది కొద్ది కాలమే అయినా.. అనునిత్యమూ భర్త వేధింపులు ఆమెకు చేదు అనుభవాలే మిగిల్చాయి. కూతురి జీవితంలోకి తల్లిదండ్రులు కల్పించుకుంటే సహించలేని మునికష్ణ మరింత హింసించేవాడు. దీంతో విసుగు చెందిన తల్లిదండ్రులు నెమ్మదిగా నీలిమకు దూరమవుతూ వచ్చారు. తరచూ భార్యతో గొడవపడే మునికష్ణ పరిస్థితి తారాస్థాయికి చేరుకున్నప్పుడు ఆమెను ఒంటరిగా వదిలి కేరళకు పారిపోయేవాడు. ఆ సమయంలో నీలిమను తల్లిదండ్రులు చేరదీస్తే వారిపై చిందులు తొక్కేవాడు. దీంతో వారు శాశ్వతంగా ఆమెకు దూరమయ్యారు.
అబార్షన్ చేయించుకోలేదని...
ఏడాది క్రితం నీలిమా గర్భం దాల్చింది. విషయం తెలుసుకున్న మునికష్ణ అబార్షన్ చేయించుకోవాలని ఆమెను ఒత్తిడి చేశాడు. అందుకు అంగీకరించకపోవడంతో ఆమె పట్ల నిర్ధయగా వ్యవహరించేవాడు. గర్భిణి అని కూడా చూడకుండా దారుణంగా వ్యవహరించేవాడు. ఈ నేపథ్యంలోనే నెలలు నిండడంతో గత నెల 4న ధర్మవరం ప్రభుత్వాస్పత్రిలో పండంటి కవలలకు నీలిమ జన్మనిచ్చింది. ఇద్దరూ మగపిల్లలు కావడంతో వారిని చూసిన తర్వాతైనా తన భర్తలో మార్పు వస్తుందని ఆమె భావించింది. తనను, పిల్లలను బాగా చూసుకుంటాడని ఆశపడింది. అయితే వారం రోజులకే మునికష్ణ ఇంట్లోంచి వెళ్లిపోయాడు.
పౌష్టికార లోపంతో రక్తహీనత
ఆస్పత్రి నుంచి ఇద్దరు శిశువులతో ఇంటికి చేరుకున్న నీలిమకు సపర్యలు చేసేందుకు కూడా ఎవరూ లేరు. అన్నీ తానే చేసుకునేది. కాలనీ వాసులు కొంత మేర సహకరించేవారు. ఇలాంటి సమయంలో తోడుగా ఉంటాడనుకున్న భర్త చెప్పాపెట్టకుండా ఇళ్లు వదిలి వెళ్లిపోయాడు. చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. అల్లుడి ప్రవర్తనకు భయపడి నీలిమ తల్లిదండ్రులు ఆమెను చేరదీసేందుకు ముందుకు రాలేదు. ఒకటి.. రెండు... రోజులు గడుస్తున్నా... భర్త వెనుదిరిగి ఇంటికి రాలేదు. పూట గడవడం కష్టమైంది. ఇంట్లో ఉన్న తింyì lగింజలు కాస్తా అయిపోయాయి. పౌష్టికాహారం లోపించడంతో క్రమేణ నీలిమ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తూ వచ్చింది. తల్లితో పాటు పిల్లలూ రక్తహీనత బారిన పడ్డారు. శిశువుల పరిస్థితి మరింత క్షీణించింది. ఒకరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. విషయాన్ని గుర్తించిన కాలనీ వాసులు బాలింతరాలికి సాయం చేస్తూ వస్తున్నారు. ఆ దారిన పోయేవారు సైతం ఆమె దీనావస్థకు చలించిపోతున్నారు. తమకు తోచిన ఆర్థిక సాయం అందిస్తున్నారు. తీవ్ర రక్తహీనతతో బాధపడుతున్న పిల్లలను ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించలేని అసహాయ స్థితిలో నీలిమ కొట్టుమిట్టాడుతోంది.
ఇల్లు ఖాళీ చేయమంటున్నారు
తెలివి తక్కువదానివని నా భర్త నన్ను వేధించేవాడు. గర్భం దాల్చిన తర్వాత పిల్లలు వద్దని గొడవ పడ్డాడు. అయినా నేను వినలేదు. కవలలు పుట్టిన తర్వాత చెప్పాపెట్టకుండా వెళ్లిపోయాడు. నా భర్త ప్రవర్తనకు భయపడి నా తల్లిదండ్రులు మాట్లాడడం మానేశారు. మూడు నెలలుగా ఇంటి అద్దె కట్టకపోవడంతో యజమానులు ఖాళీ చేయమంటున్నారు. పిల్లల ఆరోగ్యం బాగా లేదు. ఎవరైనా నా పిల్లలకు మెరుగైన వైద్య చేయించండి
– నీలిమ, బాధితురాలు
న్యాయం చేయాలి
నీలిమ పరిస్థితి చూసి కాలనీలో వాళ్లం మా వంతు సాయం అందిస్తున్నాం. రోజూ ఆసుపత్రికి తీసుకెళ్లి ఖరీదైన వైద్యం చేయించాలంటే మాకూ ఇబ్బందిగా ఉంది. అ«ధికారులు స్పందించి పిల్లలను, ఆమెను స్త్రీశిశు సంరక్షణ వసతి గహానికి తరలించి మెరుగైన వైద్యం అందించి న్యాయం చేయాలి.
– అన్వర్, కొత్తపేట కాలనీ
మాయమై పోయాడమ్మా...
Published Sun, Oct 2 2016 10:58 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement