11న డీఆర్‌డీఏ జాబ్‌మేళా | drda job mela on 11th | Sakshi
Sakshi News home page

11న డీఆర్‌డీఏ జాబ్‌మేళా

Nov 9 2016 9:12 PM | Updated on Sep 4 2017 7:39 PM

డీఆర్‌డీఏ–ఈజీఎం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువకులకు ఈ నెల 11న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు డీఆర్‌డీఏ పీడీ రామకృష్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

కర్నూలు(హాస్పిటల్‌): డీఆర్‌డీఏ–ఈజీఎం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువకులకు ఈ నెల 11న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు డీఆర్‌డీఏ పీడీ రామకృష్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు స్థానిక బి.తాండ్రపాడులోని టీటీడీసీలో అభ్యర్థులు తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, ఆధార్‌ కార్డులతో ఎంపిక ప్రక్రియకు హాజరుకావాలన్నారు. రాక్సా అకాడమీలో సెక్యూరిటీ గార్డు పోస్టుకు ఎంపిక నిర్వహిస్తామన్నారు. వీరికి మూడు నెలల పాటు అనంతపురంలో శిక్షణ ఇస్తారని, శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజన సదుపాయం ఉంటుందన్నారు. వివరాలకు 08518–277499, 8522083879, 8341581022, 9177016174 నెంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement