పచ్చకామెర్లతో దంపతుల మృతి | couple died with jaundis | Sakshi
Sakshi News home page

పచ్చకామెర్లతో దంపతుల మృతి

Jul 31 2016 11:02 PM | Updated on Sep 4 2017 7:13 AM

మృతి చెందిన గొంపరాము, పాపమ్మ

మృతి చెందిన గొంపరాము, పాపమ్మ

పచ్చకామర్లెతో భార్యాభర్తలు మృతి చెందిన సంఘటన మండలంలోని గంగచోళ్లపెంట గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గొంపరాము (40), గొంప పాపమ్మ(36)లకు కొద్దిరోజులుగా ఆరోగ్యం బాగోలేకపోవడంతో కుటుంబ సభ్యులు విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించారు.

గజపతినగరం రూరల్‌ : పచ్చకామర్లెతో భార్యాభర్తలు మృతి చెందిన సంఘటన మండలంలోని గంగచోళ్లపెంట గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గొంపరాము (40), గొంప పాపమ్మ(36)లకు కొద్దిరోజులుగా ఆరోగ్యం బాగోలేకపోవడంతో కుటుంబ సభ్యులు విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించారు. అప్పటికే రాము పరిస్థితి విషమించడంతో విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పచ్చకామెర్ల వ్యాధి తీవ్రం కావడంతో రాము విశాఖపట్నంలోని ఆస్పత్రిలో, పాపమ్మ విజయనగరం కేంద్రాస్పత్రిలో ఆదివారం మృతి చెందారు. మృతులకు నలుగురు కుమార్తెలుండగా, ఒకరికి వివాహం జరిగింది. మిగిలిన ముగ్గురు చదువుకుంటున్నారు.  
 
 

Advertisement
 
Advertisement
Advertisement