బండపోతుగళ్‌లో అదుపులో అతిసార | Control of diarrheal | Sakshi
Sakshi News home page

బండపోతుగళ్‌లో అదుపులో అతిసార

Aug 2 2016 8:00 PM | Updated on Sep 4 2017 7:30 AM

మండలంలోని బండపోతుగళ్‌లో అతిసార అదుపులోకి వచ్చింది. అధికారులు సకాలంలో స్పందించి మెరుగైన వైద్యం అందించడంతో అతిసార తగ్గింది.

కౌడిపల్లి: మండలంలోని బండపోతుగళ్‌లో అతిసార అదుపులోకి వచ్చింది. అధికారులు సకాలంలో స్పందించి మెరుగైన వైద్యం అందించడంతో అతిసార తగ్గింది. మంగళవారం నాటి వైద్య శిబిరంలో కేవలం ముగ్గురు మాత్రమే ఓపీ చూయించుకున్నారు. ఎవరికి వాంతులు విరేచనాలు లేవని డాక్టర్‌ దివ్యజ్ఞ తెలిపారు. ఈఓపీఆర్డీ సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శులు వెంకటేశ్‌, నరేష్‌, విజయ్‌పాల్‌రెడ్డి తదితరులు గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను పర్యవేక్షించారు. రక్షిత మంచినీటి పథకం వద్ద కట్‌ వాల్వ్‌లను పరిశీలించి లీకేజీలు లేకుండా చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement