కేసీఆర్ తీరు మారడంలో ఆంతర్యమేంటి? | Cheruku Sudhakar fires on CM KCR | Sakshi
Sakshi News home page

కేసీఆర్ తీరు మారడంలో ఆంతర్యమేంటి?

Dec 9 2016 2:37 AM | Updated on Aug 14 2018 10:54 AM

కేసీఆర్ తీరు మారడంలో ఆంతర్యమేంటి? - Sakshi

కేసీఆర్ తీరు మారడంలో ఆంతర్యమేంటి?

పెద్ద నోట్ల రద్దుపై ముందుగా ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రెండు రోజుల్లో వైఖరి మార్చుకున్నారని,

తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు సుధాకర్
 హన్మకొండ: పెద్ద నోట్ల రద్దుపై ముందుగా ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రెండు రోజుల్లో వైఖరి మార్చుకున్నారని, దాని వెనుక ఆంతర్య మేమిటో ప్రజలకు చెప్పాలని తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు సుధాకర్ డిమాండ్ చేశారు. గురువారం హన్మకొండలో సెంటర్ ఫర్ సోషల్ థాట్స్, తెలంగాణ ఉద్యమ వేదిక అధ్వర్యంలో ‘పెద్ద నోట్ల రద్దు.. దేశానికి లాభమా..? ప్రజలపై యుద్ధమా..?’ అనే అంశంపై చర్చాగోష్టి జరిగింది. ఇందులో చెరుకు సుధాకర్ మాట్లాడుతూ రూ.500, రూ.వేరుు నోట్లను రద్దును వ్యతిరేకించిన సీఎం కేసీఆర్.. ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన నాటి నుంచి పెద్ద నోట్ల రద్దుపై నోరు మెదపడం లేదని అన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement