సినిమా సీన్లనే తలదన్నే లవ్ స్టోరీ..! | Cancel lover engagement and own his love | Sakshi
Sakshi News home page

సినిమా సీన్లనే తలదన్నే లవ్ స్టోరీ..!

Dec 16 2016 12:36 AM | Updated on Sep 4 2017 10:48 PM

సినిమా సీన్లనే తలదన్నే లవ్ స్టోరీ..!

సినిమా సీన్లనే తలదన్నే లవ్ స్టోరీ..!

సినిమాలలో ప్రేమ కథలు మొదట్లో హీరో, హీరోయిన్ల పరిచయం.. ఆ తర్వాత అంతా సవ్యంగా సాగిపోతూ.. ఆపై పెద్దవాళ్లు పెళ్లికి నో చెప్పడం, ఏదో ఒకటి చేసి హీరోయిన్ కుటుంబాన్ని హీరో ఒప్పించడం జరుగుతుంటాయి.

విశాఖపట్నం: సినిమాలలో ప్రేమ కథలు మొదట్లో హీరో, హీరోయిన్ల పరిచయం.. ఆ తర్వాత అంతా సవ్యంగా సాగిపోతూ.. ఆపై పెద్దవాళ్లు పెళ్లికి నో చెప్పడం, ఏదో ఒకటి చేసి హీరోయిన్ కుటుంబాన్ని హీరో ఒప్పించడం జరుగుతుంటాయి. సినిమా సన్నివేశాన్ని తలదన్నే సీన్ ఒకటి విశాఖలో జరిగింది. ఓ యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. అయితే రీల్ లైఫ్ లో ఓకే కానీ, రియల్ లైఫ్ లో జరగడం షాకింగ్ సంఘటన. సినిమాలో తరహాలోనే వీరి పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదు. ప్రేయసికి ఎంగేజ్ మెంట్ జరుగుతుందని తెలుసుకున్న ఆ ప్రేమికుడు ఆమె ఇంటికి వెళ్లాడు.

ఓ వైపు నిశ్చితార్థ వేడుక కనుక ఇంట్లో పూర్తిగా సందడి వాతావరణం నెలకొంది. ఇంతలో ఊహించని ట్విస్ట్.. మరికొద్ది నిమిషాల్లో ఎంగేజ్ మెంట్ జరగనుండగా తన ప్రేయసిని అందరు చూస్తుండగానే ఆ యువకుడు ముద్దు పెట్టుకున్నాడు. దీంతో ఆ అమ్మాయితో ఎంగేజ్ మెంట్ కి సిద్ధంగా ఉన్న వ్యక్తితో పాటు రెండు కుటుంబాల వారు షాక్ తిన్నారు.

ముద్దు పెట్టుకున్న యువకుడిపై తిరగబడి అతడ్ని కొడతారని అక్కడున్నవారు భావించారు. కానీ అక్కడ అలాంటిదేం జరగకపోగా వారి పెళ్లికి అమ్మాయి పేరెంట్స్ ఓకే చెప్పారు. వారు ఎంతకాలం నుంచి ప్రేమలో ఉన్నారు, ఒకరంటే మరొకరికి ఎంత ఇష్టం అన్నది ప్రేమజంట వివరించింది. దీంతో చేసేందేం లేక వారి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరోవైపు ఎంగేజ్ మెంట్ పై ఎన్నో ఆశలతో వచ్చిన మరో కాబోయే వరుడు కుటుంబంతో పాటు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

Advertisement
 
Advertisement
Advertisement