నయీం గ్యాంగ్‌ పేరుతో ఆకతాయిల బెదిరింపులు ? | Brats nayim threats in the name of the gang? | Sakshi
Sakshi News home page

నయీం గ్యాంగ్‌ పేరుతో ఆకతాయిల బెదిరింపులు ?

Sep 21 2016 12:30 AM | Updated on Sep 4 2017 2:16 PM

పోలీసుల చేతిలో హతమైన గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ పేరుతో కొంతమంది ఆకతాయిలు మండల కేంద్రానికి చెంది న ఓ ఫర్టిలైజర్‌ వ్యాపారికి బెదిరింపు కాల్‌ చేసినట్లు తెలిసింది. రెండు నెలల క్రితం గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ పోలీసుల చేతిలో ప్రాణాలు వదిలిన విషయం తెలిసిందే.

ములుగు : పోలీసుల చేతిలో హతమైన గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ పేరుతో కొంతమంది ఆకతాయిలు మండల కేంద్రానికి చెంది న ఓ ఫర్టిలైజర్‌ వ్యాపారికి బెదిరింపు కాల్‌ చేసినట్లు తెలిసింది. రెండు నెలల క్రితం గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ పోలీసుల చేతిలో ప్రాణాలు వదిలిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నయీ మ్‌ కథ ముగిసింది. అయినా కొంతమంది ఆకతాయిలు న యీమ్‌ గ్యాంగ్‌ పేరుతో ములుగు మండల కేంద్రానికి చెందిన ఓ వ్యాపారిని డబ్బులు ఇవ్వాల్సిందిగా డిమాండ్‌ చేసినట్లు తెలి సింది. దీంతో బాధిత వ్యాపారి పోలీసులను ఆశ్రయించినట్లు తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 

Advertisement
 
Advertisement
Advertisement