ఆటో బోల్తా : డ్రైవర్‌కు గాయాలు | AUTO CRASHED ONE INJURED | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా : డ్రైవర్‌కు గాయాలు

Sep 10 2016 11:35 PM | Updated on Sep 4 2017 12:58 PM

మండలంలోని తురకపేట సెంటర్‌కు సమీపంలో పెద్దఖానాల వద్ద అలికాం–బత్తిలి రోడ్డుపై శనివారం ఆటో బోల్తా పడి డ్రైవర్‌కు గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం... హిరమండలం నుంచి ఆమదాలవలస వైపు వెళ్తున్న ఆటో డ్రైవర్‌ ఇరుకైన ఖానా మధ్యకు చేరుకున్నాడు. అప్పటికే ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనానికి ఢీకొనంటానేమో అనే భయంతో ఆటో డ్రైవర్‌ కానాకు ఢీకొట్టడంతో రోడ్డు మధ్యలో ఆటో బొల్తాపడింది.

ఎల్‌.ఎన్‌.పేట : మండలంలోని తురకపేట సెంటర్‌కు సమీపంలో పెద్దఖానాల వద్ద అలికాం–బత్తిలి రోడ్డుపై శనివారం ఆటో బోల్తా పడి డ్రైవర్‌కు గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం... హిరమండలం నుంచి ఆమదాలవలస వైపు వెళ్తున్న ఆటో డ్రైవర్‌ ఇరుకైన ఖానా మధ్యకు చేరుకున్నాడు. అప్పటికే ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనానికి ఢీకొనంటానేమో అనే భయంతో ఆటో డ్రైవర్‌ కానాకు ఢీకొట్టడంతో రోడ్డు మధ్యలో ఆటో బొల్తాపడింది. ఆటోలో ఉన్న ముగ్గురు ప్రయాణికులు సురక్షితంగా బయట పడ్డారని స్థానికులు తెలిపారు. హిరమండలం కల్లట గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ రామారావుకు తలపైన, ముఖంపైన గాయాలుయ్యాయి.  డ్రైవర్‌ను హిరమండలంలోని ప్రైవేటు వైద్యుని వద్దకు చికిత్స కోసం తరలించినట్టు స్థానికులు చెప్పారు.  

Advertisement
 
Advertisement
Advertisement