నటిని మోసం చేసిన సినీ నిర్మాత అరెస్ట్‌ | Sakshi
Sakshi News home page

నటిని మోసం చేసిన సినీ నిర్మాత అరెస్ట్‌

Published Wed, Dec 20 2017 8:51 PM

Kollywood Producer arrested in Actress cheating case - Sakshi

సాక్షి, సినిమా: సినిమాలో కథానాయకి అవకాశం కల్పిస్తానని చెప్పి, నగదు, నగలు తీసుకుని మోసం చేసిన సినీ నిర్మాతను పోలీసులు అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు. వివరాల్లోకెళ్లితే.. వలసరవాక్కంలోని వెంకటేశ్వర నగర్ మురుగన్‌ వీధిలో నివసిస్తున్న మోహన్‌కుమార్‌ అనే వ్యక్తి అన్బు మరణం అనే చిత్రం రూపొందిస్తున్నట్లు ఓ నటిని నమ్మించాడు. తాను నిర్మించబోయే అన్బు మరణం మూవీలో కథానాయకిగా అవకాశం ఇప్పిస్తానని చెప్పి ముంబయికి చెందిన సౌందర్యరాజన్‌ భార్య తమిళ సెల్వి (33) నుంచి రూ.5లక్షల నగదు, రూ. 1.20 లక్షల విలువ చేసే నగలను తీసుకున్నాడు. తనకు మూవీ చాన్స్ గురించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో సెల్వి తాను మోసపోయినట్లు గుర్తించింది. మోహన్‌కుమార్‌ ఎలాంటి సినిమానూ నిర్మించలేదనీ, తనకు నటిగా అవకాశం కల్పించలేదనీ, తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించలేదనీ బాధితురాలు సెల్వి వలసరవాక్కం పోలీసులకు పిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మోహన్‌కుమార్‌ను అరెస్ట్‌ చేసి విచారణ జరుపుతున్నారు.

 

Advertisement
Advertisement