టీవీ చూస్తుండగా తల్లి మందలించిందని.. | Sakshi
Sakshi News home page

తల్లి తిట్టిందని విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

Published Wed, Jun 5 2019 10:13 PM

Girl Suicide Attempts Over Mothers Scolds - Sakshi

సాక్షి, చెన్నై : టీవీ చూస్తుండగా తల్లి మందలించడంతో విరక్తి చెందిన కళాశాల విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. సంఘటనలో తాడు  తెగిపోవడంతో అదృష్టవశాత్తు మృత్యువు నుంచి బయటపడింది. చెన్నై గిండి ఐఐటీ ప్రాంతంలోని నెయిదల్‌ నివాస ప్రాంతానికి చెందిన రాజ్‌ కుమార్తె నర్మద (18) తేనాంపేటలోని ఉమెన్స్‌ కళాశాలలో బీఏ  ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. సోమవారం రాత్రి చదువుకోకుండా టీవీ ఎందుకు చూస్తున్నావని నర్మదను తల్లి మందలించింది. దీంతో విరక్తి చెందిన నర్మ ద ఆమె గదిలోకి వెళ్లి తలుపులు గడి పెట్టుకుంది.

హఠాత్తుగా గది నుంచి శబ్దం వినబడటంతో దిగ్భ్రాంతి చెందిన తల్లిదండ్రులు వెంటనే తలుపులు పగులగొట్టి చూడగా ఆ సమయంలో నర్మద ఆత్మహత్యకు యత్నించినట్టు తెలిసింది. ఉరి వేసుకోవడానికి ఉపయోగించిన కరెంట్‌ వైర్‌ బరువును తూగలేక తెగి పోవడంతో విద్యార్థిని ప్రాణగండం నుం చి బయటపడింది. వెంటనే ఆమెను చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. దీనిపై సమాచారం అందుకున్న కోట్టూరుపురం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.  

Advertisement
Advertisement