-
స్వల్పంగా పెరిగిన పసిడి.. అదే బాటలో వెండి
గత వారంలో పడుతూ.. లేస్తూ కొనసాగిన బంగారం ధరలు, ఈ వారం ప్రారంభంలో కొంత పెరుగుదల వైపు అడుగులు వేసాయి. దీంతో తులం పసిడి ధర సోమవారం రూ.200 నుంచి రూ.220 వరకు పెరిగింది. ధరలు పెరగడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో, చెన్నై, ఢిల్లీలలో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయనే వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో మాత్రమే కాకుండా గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఈ రోజు ఒక తులం బంగారం ధరలు రూ.66050 (22 క్యారెట్స్), రూ.72050 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్న స్థిరంగా ఉన్న పసిడి ధరలు ఈ రోజు రూ. 200 నుంచి రూ. 220 వరకు పెరిగాయి.దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా నేడు బంగారం ధరల్లో స్వల్పంగా పెరిగాయి. కాబట్టి ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు 66200 రూపాయలు.. 24 క్యారెట్ల ధర 72200 రూపాయల వద్ద ఉన్నాయి. నిన్న స్థిరంగా ఉన్న గోల్డ్ రేట్లు ఈ రోజు కొంత పెరుగుదల దిశగా అడుగులు వేసాయి.తెలుగు రాష్ట్రాల్లో, ఢిల్లీలలో రూ. 200 నుంచి రూ. 220 పెరిగిన ధరలు చెన్నైలో మాత్రం రూ. 100 నుంచి రూ. 110 వరకు మాత్రమే పెరిగింది. దీంతో సోమవారం చెన్నైలో బంగారం ధరలు రూ. 66100 (10 గ్రాముల 22 క్యారెట్స్) రూ. 72110 (10 గ్రాముల 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి.వెండి ధరలుబంగారం ధరలు మాదిరిగానే వెండి ధరలు కూడా రూ. 1000 (ఒక కేజీ వెండి) పెరిగింది. కాబట్టి ఒక కేజీ వెండి ధర ఈ రోజు (మే 6) రూ. 84000 వద్ద ఉంది. చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ నగరాల్లో కూడా వెండి ధరలు కొంత పెరిగినట్లు స్పష్టమవుతోంది. -
ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌మార్కెట్ సూచీలు..
దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం ఫ్లాట్‌గా ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 16 పాయింట్లు నష్టపోయి 22,459 వద్దకు చేరింది. సెన్సెక్స్ 17 పాయింట్లు లాభపడి 73,895 వద్దకు చేరింది.సెన్సెక్స్ 30 సూచీలో కోటక్ మహీంద్రా బ్యాంక్, టీసీఎస్, హెచ్‌యూఎల్, సన్‌ఫార్మా, ఎం అండ్ ఎం, ఇండస్ఇండ్ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, విప్రో, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి.టైటాన్, ఎస్బీఐ, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్, ఎల్ అండ్ టీ, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతీసుజుకీ కంపెనీ షేర్లు నష్టపోయాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ప్రభుత్వ యాప్‌లకు ప్రత్యేక లేబుల్..! కారణం..
ప్రభుత్వ మొబైల్ యాప్‌లకు ప్రత్యేకమైన లేబుల్ వాడనున్నారు. ఈమేరకు ప్లేస్టోర్‌లో ప్రభుత్వ యాప్‌లకు లేబుల్వాడేందుకు గూగుల్ సిద్ధమైంది. ప్రస్తుత రోజుల్లో ఆన్లైన్ లావాదేవీలతోపాటు ఓటీటీ యుటిలిటీ బిల్లు చెల్లింపులు, క్రెడిట్ కార్డుల చెల్లింపుల వరకూ..దాదాపు డిజిటల్‌గానే జరుగుతున్నాయి. డిజిటలైజేషన్ పెరుగుతున్న నేపథ్యంలో ఆన్లైన్ మోసాలు అధికమవుతున్నాయి. వీటిని కట్టడిచేసేందుకు ఈ మార్పులు తీసుకురాబోతున్నట్లు తెలిసింది.ప్లేస్టోర్‌లో లక్షల్లో యాప్‌లు పుట్టుకొస్తున్నాయి. వాటిలో వినియోగదారులకు ఏది నమ్మకమైన యాప్..ఏది కాదో అనే అంశంపై స్పష్టత కరవవుతోంది. కొన్ని ప్రభుత్వ యాప్‌లో వ్యక్తిగత సమాచారం పంచుకోవాల్సి ఉంటుంది. అయితే అలా మన వివరాలిస్తున్న యాప్ అసలు ప్రభుత్వ ఆమోదం పొందిందా..లేదా అనే విషయాన్ని ధ్రువపరుస్తూ కొత్త మార్పులు తీసుకురానున్నారు. ప్లేస్టోర్‌లోని ప్రభుత్వ యాప్‌లకు ప్రత్యేక లేబుల్ ఉపయోగించనున్నారు. దాంతో ఆ యాప్‌లను వెంటనే గుర్తించే వీలుంటుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ మేరకు యాప్‌లో లేబుల్ ఉంచేందుకు గూగుల్ సైతం సిద్ధమైందని తెలిసింది.ఇదీ చదవండి: ప్రముఖ కంపెనీలకు ఇకపై బాస్‌లు వీరే..‘ఎక్స్’ (ట్విటర్)లో బ్లూటిక్ ఎవరైనా కొనుగోలు చేసే వీలు ఉండటంతో ప్రభుత్వ ఖాతాలను తేలిగ్గా గుర్తించడానికి గ్రే టిక్ ఇవ్వడంతో అదే పేరుతో నకిలీ ఖాతాలు నడుపుతున్న వారిని తేలిగ్గా గుర్తించవచ్చు. ఇదే తరహాలో గూగుల్ ప్లే స్టోర్ లేబుల్ తెచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల యాప్‌లకు గూగుల్ ప్లే స్టోర్‌లో ఇకపై లేబుల్ కనిపిస్తుంది. -
ప్రముఖ కంపెనీలకు ఇకపై బాస్‌లు వీరే..
సంపన్నులైన వ్యాపార దిగ్గజాలు వారి బిజినెస్ కార్యకలాపాలను తమ వారసులకు అప్పగిస్తున్నారు. ఇప్పటికే ఆసియాలోనే కుబేరుడైన ముఖేశ్ అంబానీ తన వారసులకు వ్యాపారాలను అప్పగించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వ్యాపారస్థులు తమ తర్వాత తరాన్ని పరిచయం చేస్తున్నారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఫోర్బ్స్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్స్ ర్యాంకింగ్ 2024లో ఉన్న 2,781 మందిలో దాదాపు మూడింట ఒకవంతు మంది అంటే మొత్తం 934 మంది తమ వారసులకు వ్యాపారాన్ని అప్పగించారు. వీరు నడిపిస్తున్న కంపెనీలు, వాటి మార్కెటింగ్ విలువ ఏకంగా 5 ట్రిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంది.ముఖేశ్ అంబానీరిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ సంపద దాదాపు 113.5 బిలియన్ అమెరికన్ డాలర్లు. రిలయన్స్ టెలికాం విభాగం జియో ఇన్ఫోకామ్‌కు తన పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ సారథ్యం వహిస్తున్నారు. కూతురు ఇషా అంబానీ రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. రెండో కుమారుడు అనంత్ అంబానీ పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు.బెర్నార్డ్ ఆర్నాల్ట్ప్రపంచ కుబేరుల్లో మొదటి స్థానంలో ఉన్న బెర్నార్డ్ ఆర్నాల్ట్‌కు డెల్ఫిన్ ఆర్నాల్ట్, ఆంటోయిన్ ఆర్నాల్ట్, జీన్ ఆర్నాల్ట్, ఫ్రెడెరిక్ ఆర్నాల్ట్, అలెగ్జాండర్ ఆర్నాల్ట్ అనే వారసులున్నారు. తన కుటుంబ సంపద మొత్తం 214.1 బిలియన్ అమెరికన్ డాలర్లు. తన వారసులు బెర్నార్డ్ ఆర్నాల్ట్ కంపెనీ ఎల్వీఎంహెచ్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. డెల్ఫిన్ ఆర్నాల్ట్(49) 2023లో మాంటిల్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఆంటోయిన్ ఆర్నాల్ట్(46) ఎల్వీఎంహెచ్ కమ్యూనికేషన్స్, ఇమేజ్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇనిషియేటివ్ విభాగాన్ని పర్యవేక్షిస్తారు. అలెగ్జాండర్ ఆర్నాల్ట్(31) కమ్యూనికేషన్ విభాగంలో పనిచేస్తున్నారు. ఫ్రెడెరిక్ ఆర్నార్ట్(29)ట్యాగ్‌హ్యూర్ పదవీకాలం తర్వాత 2024లో ఎల్వీఎంహెచ్ వాచెస్‌కు సీఈఓగా చేరారు. జీన్ ఆర్నాల్ట్(25) 2021లో ఎల్వీఎంహెచ్లో చేరారు. లూయిస్ విట్టన్ వాచీల విభాగానికి మార్కెటింగ్ హెడ్‌గా చేస్తున్నారు.అదానీ గ్రూప్గౌతమ్ అదానీ ఛైర్మన్‌గా ఉన్న ఈ గ్రూప్ సంపద సుమారు 102.4 బిలియన్ అమెరికన్ డాలర్లు. ఆయనకు కరణ్, జీత్ అదానీలు ఇద్దరు కుమారులు. పర్డ్యూ యూనివర్శిటీ నుంచి ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్ అయిన కరణ్ తన తండ్రి తర్వాత అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఏపీసెజ్) మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. జీత్ అదానీ 2019లో అదానీ గ్రూప్‌లో చేరారు.షాపూర్జీ పల్లోంజీ గ్రూప్షాపూర్ మిస్త్రీ స్థాపించిన ఈ గ్రూప్ సంపద 37.7 బిలియన్ యూఎస్ డాలర్లుగా ఉంది. షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ వారసుడిగా పల్లోన్ మిస్త్రీ సంస్థను ముందుండి నడిపిస్తున్నారు. ఈ గ్రూప్‌నకు నిర్మాణం, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి పేరుంది. ఇందులో టాటా సన్స్ వాటా కలిగి ఉంది.ఇదీ చదవండి: 15 టన్నుల కల్తీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్టుఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్లాఓరీల్ సంస్థ వ్యవస్థాపకుడు ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్ 94.5 బిలియన్ డాలర్ల సందప కలిగి ఉన్నారు. ప్రపంచంలోని ప్రముఖ సౌందర్య సాధనాల దిగ్గజ సంస్థగా లాఓరీల్‌కు మంచి పేరుంది. ప్రపంచంలోని అత్యంత సంపన్న మహిళ ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్ వారసులు జీన్-విక్టర్, నికోలస్ మేయర్స్. జీన్-విక్టర్ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో పనిచేస్తున్నారు. నికోలస్ మేయర్స్ కుంటుంబం పెట్టుబడి సంస్థకు సంబంధించిన వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు. -
పెరిగిన రుణాలు.. రెండేళ్లలో రూ.10లక్షల కోట్లు
సొంతిల్లు సామాన్యుడి కల. రోజురోజుకు రియల్ ఎస్టేట్ బూమ్ పెరుగుతోంది. దాంతో రియల్టీ వ్యాపారులు, గృహాలు నిర్మిస్తున్న డెవలపర్లు వాటిని కొనుగోలు చేయాలనుకునేవారిని వివిధ మార్గాల ద్వారా ఆకర్షిస్తున్నారు. దాంతో మరింత సమయం వేచిచూస్తే ధరలు పెరుగుతాయనే భావనతో ఎలాగోలా అప్పు చేసైనా గృహాలు కొంటున్నారు. అలా ఏటా వినియోగదారులు తీసుకుంటున్న గృహ రుణాలు బ్యాంకుల వద్ద పేరుకుపోతున్నాయి. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రికార్డు స్థాయిలో రూ.10లక్షల కోట్ల గృహ నిర్మాణ రంగ రుణాలు పెరిగాయి.ఇదీ చదవండి: 15 టన్నుల కల్తీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్టు2024 మార్చి నెల వరకు గృహ నిర్మాణ రంగానికి బకాయిపడిన రుణాలు రికార్డు స్థాయిలో రూ.27.23 లక్షల కోట్లకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన డేటా ప్రకారం తెలిసింది. 2022 మార్చి నాటికి రూ.17,26,697 కోట్ల బకాయిలు ఉండగా, 2023 మార్చి నాటికి రూ.19,88,532 కోట్లకు, 2024 మార్చి నాటికి రూ.27,22,720 కోట్లకు చేరాయని పేర్కొంది. వాణిజ్య స్థిరాస్తి రుణ బకాయిలు 2024 మార్చి నాటికి రూ.4,48,145 కోట్లకు చేరాయని, 2022 మార్చిలో రూ.2,97,231 కోట్లుగా ఉన్నాయని వెల్లడించింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement