ప్రీ-ఆర్డర్‌కు వచ్చిన రెడ్‌మి నోట్‌ 5 ప్రొ | Xiaomi Redmi Note 5 Pro Now Open For Pre Orders | Sakshi
Sakshi News home page

ప్రీ-ఆర్డర్‌కు వచ్చిన రెడ్‌మి నోట్‌ 5 ప్రొ

Apr 13 2018 11:26 AM | Updated on Apr 13 2018 2:23 PM

Xiaomi Redmi Note 5 Pro Now Open For Pre Orders - Sakshi

రెడ్‌మి నోట్‌ 5 ప్రొ స్మార్ట్‌ఫోన్‌

షావోమి రెడ్‌మి నోట్‌ 5 సిరీస్‌లో హై-ఎండ్‌ వేరియంట్‌ రెడ్‌మి నోట్‌ 5 ప్రొ నేడు ప్రీ-ఆర్డర్స్‌కు వచ్చేసింది. షావోమి ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌ ఎంఐ.కామ్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ ప్రీ-ఆర్డర్లకు ఉంచింది.  దీంతో ఇక నుంచి రెడ్‌మి నోట్‌ 5 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ ఫ్లాష్‌సేల్‌ కోసం వేచిచూడాల్సినవసరం లేదు. ఈ ఫోన్‌ ఫ్లాష్‌ సేల్‌కు వచ్చిన ప్రతీసారి‘సోల్డ్‌ అవుట్‌’ అని దర్శనమిస్తుండటంతో వినియోగదారులు తీవ్ర నిరాశకు గురవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కంపెనీ రెడ్‌మి నోట్‌ 5 ప్రొ ప్రీ-ఆర్డర్లను స్వీకరిస్తున్నట్టు ప్రకటించింది. నేటి మధ్యాహ్నం 12 గంటల నుంచి ఎంఐ వెబ్‌సైట్‌ ద్వారా ఈ ఫోన్‌ను ఆర్డర్‌ చేసుకునే వెసులుబాటును కల్పించింది. 

ఈ ఫోన్‌ను క్యాష్‌ ఆన్‌ డెలివరీ ఆప్షన్‌లో ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉంచింది. ఆర్డర్‌ చేసిన తర్వాత రెండు లేదా నాలుగు వారాల్లో ఈ ఫోన్‌ను వినియోగదారుడికి డెలివరీ అవుతుంది. ఒక వ్యక్తి ఒకటి, లేదా రెండు మాత్రమే ఫోన్‌లను ఆర్డర్‌ చేసే సౌకర్యం కల్పించింది. ఒకవేళ ముందస్తు ఆర్డర్‌ను రద్దు చేసుకోవాలనుకుంటే ఫోన్‌ షిప్పింగ్‌ కన్నా ముందే రద్దు చేసుకోవాలి. ఫ్లిప్‌కార్ట్‌లో కూడా రెడ్‌మి నోట్‌ 5 ప్రొ అందుబాటులో ఉంటుంది. కానీ వీక్లీ ఫ్లాష్‌ సేల్స్‌ ద్వారానే ఫ్లిప్‌కార్ట్‌ ఈ ఫోన్‌ను విక్రయించనుంది. 

4జీబీ ర్యామ్‌ 64జీబీ మెమరీ సామర్థ్యం ఉన్న రెడ్‌మి నోట్‌ 5 ప్రొ ధర రూ.13,999 కాగా, 6జీబీ ర్యామ్, ‌64జీబీ మెమరీ వేరియంట్‌ ధర రూ.16,999. షావోమి ఇప్పటి వరకు దేశీయ మార్కెట్‌లో ప్రవేశపెట్టిన ఫోన్లన్నంటిలో ఇదే ఖరీదైనది. ఇది నలుపు, గోల్డ్‌, లేక్‌ బ్లూ, రోజ్‌ గోల్డ్‌ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ఫోన్‌ ఆర్డర్‌ చేసుకున్న వారికి జియో ప్రత్యేక ఆఫర్‌ను అందిస్తోంది. రూ.2,200 విలువ కలిగిన 44 వోచర్లను ‘మై జియో’ యాప్‌లో యాడ్‌ చేస్తుంది. అంతేకాకుండా రూ.198, రూ.299 రీఛార్జ్‌తో 4.5టీబీ వరకూ డేటాను పొందవచ్చు.

రెడ్‌మి నోట్‌ 5 ప్రొ ఫీచర్స్‌
5.99 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ డిస్‌ప్లే
క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 636 ప్రాసెసర్‌
ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌,  ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌
వెనుక 12 మెగా పిక్సెల్‌, 5మెగాపిక్సెల్స్‌తో డ్యుయల్‌ కెమెరా
ముందు వైపు 20 మెగాపిక్సెల్‌ కెమెరా
4000 ఎంఎహెచ్‌ బ్యాటరీ
 

Advertisement
 
Advertisement
Advertisement