వ్యూ టెక్నాలజీస్ నుంచి 15 కొత్త స్మార్ట్ టీవీలు | View Technologies 15 new Smart TVs | Sakshi
Sakshi News home page

వ్యూ టెక్నాలజీస్ నుంచి 15 కొత్త స్మార్ట్ టీవీలు

Feb 20 2015 2:25 AM | Updated on Sep 2 2017 9:35 PM

వ్యూ టెక్నాలజీస్ నుంచి 15 కొత్త స్మార్ట్ టీవీలు

వ్యూ టెక్నాలజీస్ నుంచి 15 కొత్త స్మార్ట్ టీవీలు

టీవీలు తయారు చేసే వ్యూ టెక్నాలజీస్ సంస్థ గురువారం 15 కొత్త స్మార్ట్ టీవీలను ఆవిష్కరించింది.

న్యూఢిల్లీ: టీవీలు తయారు చేసే వ్యూ టెక్నాలజీస్ సంస్థ గురువారం 15 కొత్త స్మార్ట్ టీవీలను ఆవిష్కరించింది. 19 నుంచి 85 అంగుళాల సైజుల్లో ఉండే ఈ టీవీల ధరలు రూ.9,000 నుంచి రూ.9,00,000 లక్షల రేంజ్‌లో ఉన్నాయని సంస్థ డిజైన్ హెడ్, సీఈఓ దేవిత సరాఫ్ వెల్లడించారు.  టీవీలను ఆల్ట్రా హెచ్‌డీ లేదా 4కే టెక్నాలజీతో రూపొందించామని, ఇతర టీవీలతో పోల్చితే తమ టీవీల ధరలు 40% తక్కువని వివరించారు.

వీటిని పూర్తిగా ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారానే విక్రయిస్తామని తెలిపారు.తమ ఆదాయంలో 55% ఆన్‌లైన్ అమ్మకాల ద్వారానే వస్తున్నాయరు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో  రూ. 100 కోట్లుగా ఉన్న  తమ టర్నోవర్‌ను  వచ్చే ఆర్థిక సంవత్సరంలో మూడు రెట్లకు (రూ.300 కోట్లకు) పెంచుకోవడం లక్ష్యమని పేర్కొన్నారు. అలాగే 35 వేలుగా ఉన్న టీవీల విక్రయాన్ని లక్షకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement