తెలుగు రాష్ట్రాల్లో టీవీఎస్ ఎక్స్ఎల్ 100 | tvs xl 100 in telugu states | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాల్లో టీవీఎస్ ఎక్స్ఎల్ 100

Mar 4 2016 1:39 AM | Updated on Sep 3 2017 6:55 PM

తెలుగు రాష్ట్రాల్లో టీవీఎస్ ఎక్స్ఎల్ 100

తెలుగు రాష్ట్రాల్లో టీవీఎస్ ఎక్స్ఎల్ 100

టీవీఎస్ మోటార్ కంపెనీ ఫోర్ స్ట్రోక్ టీవీఎస్ ఎక్స్‌ఎల్ 100 మోపెడ్‌ను తెలుగు రాష్ట్రాల్లో గురువారం విడుదల చేసింది.

మోపెడ్ ధర రూ.30,074
చెన్నై: టీవీఎస్ మోటార్ కంపెనీ ఫోర్ స్ట్రోక్ టీవీఎస్ ఎక్స్‌ఎల్ 100 మోపెడ్‌ను తెలుగు రాష్ట్రాల్లో గురువారం విడుదల చేసింది. ఈ మోపెడ్ ధర రూ.30,074(ఎక్స్ షోరూమ్, ఆంధ్రప్రదేశ్) అని టీవీఎస్ మోటార్ కంపెనీ తెలిపింది. 99.7 సీసీ ఫోర్ స్ట్రోక్ ఇంజిన్‌తో రూపొందించిన ఈ మోపెడ్ 4.2 పీఎస్ పవర్‌ను ఇస్తుందని, 67 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని టీవీఎస్ మోటార్ వైస్-ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ సర్వీస్) జె.ఎస్. శ్రీనివాసన్ చెప్పారు.  ఈ మోపెడ్ ఆకుపచ్చ, నలుపు, ఎరుపు, నీలం, గ్రే-ఐదు రంగుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోని తమ డీలర్ల వద్ద లభ్యమవుతుందని పేర్కొన్నారు. వినియోగదారుల అభిరుచులకనుగుణంగా అత్యున్నత నాణ్యత గల వాహనాలను అందిస్తున్నామని వివరించారు. టీవీఎస్ ఎక్స్‌ఎల్ సూపర్ హెవీ డ్యూటీ మోడల్‌ను కూడా విక్రయిస్తున్నామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement