టీవీఎస్ మోటార్ సేల్స్‌ హై జంప్‌ | TVS Motor Dec sales jump 39% | Sakshi
Sakshi News home page

టీవీఎస్ మోటార్ సేల్స్‌ హై జంప్‌

Jan 1 2018 6:15 PM | Updated on Jan 1 2018 6:15 PM

TVS Motor Dec sales jump 39% - Sakshi

 సాక్షి, ముంబయి: దేశీయ టూవీలర్‌, త్రీవీలర్‌ వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ అమ్మకాలలో భారీ వృద్ధిని సాధించింది.  డిసెంబర్  39 శాతం వృద్ధితో 2,56,909 యూనిట్లు విక్రయించింది. మొత్తం ద్విచక్ర వాహనాల విక్రయాలు 37.9 శాతం పెరిగి 2,47,630 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ గణాంకాలను సోమవారం కంపెనీ ప్రకటించింది


దేశీయ అమ్మకాలు మాత్రం 35.4 శాతం పెరిగి 2,07,778 యూనిట్లకు చేరుకున్నాయని హోసూర్‌కు చెందిన కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. డిసెంబర్ 2016 లో 55,557 యూనిట్లుండగా, స్కూటర్ విక్రయాలు 50.5 శాతం పెరిగాయి. మోటార్‌ సైకిల్ అమ్మకాలు పెరిగి 63.7 శాతం పెరిగి 95,281 యూనిట్లకు చేరుకున్నాయి.   అలాగే ఈ నెల  ఎగుమతులు 55.8 శాతం పెరిగి 47,818 యూనిట్లకు చేరుకున్నాయి. వీటిలో ద్విచక్ర వాహన ఎగుమతులు 52.7 శాతం పెరిగి39,852 యూనిట్లకు చేరుకున్నాయి. డిసెంబర్ 2017 నాటికి 5,393 యూనిట్లు విక్రయించగా .. అంతకు ముందు డిసెంబర్ 2017 నాటికి 9,279 యూనిట్లు విక్రయించింది.

Advertisement
 
Advertisement
Advertisement