నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు | Sakshi
Sakshi News home page

నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

Published Fri, Nov 10 2017 9:32 AM

Sensex opens flat, Nifty below 10,300 - Sakshi

ముంబై : స్టాక్‌ మార్కెట్లు వారం ముగింపులో ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 69.30 పాయింట్ల నష్టంలో 33,181 వద్ద, నిఫ్టీ 28.30 పాయింట్ల నష్టంలో 10,280 వద్ద కొనసాగుతున్నాయి. జీఎస్టీ మీటింగ్‌, ఎస్‌బీఐ ఫలితాలపై ఇన్వెస్టర్లు ఎక్కువగా దృష్టిసారించారు.

ప్రారంభ ట్రేడింగ్‌లో అరబిందో ఫార్మా, జిందాల్‌ స్టీల్‌, ఎస్‌బీఐ, హెచ్‌యూఎల్‌ లాభపడగా.. టాటా మోటార్స్‌, ఎం అండ్‌ ఎం, బీపీసీఎల్‌, యాక్సిస్‌ బ్యాంకు, హీరో మోటార్‌కార్పొ నష్టాలు పాలయ్యాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 8 పైసల నష్టంలో 65.04 వద్ద ఉంది. ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో బంగారం ధరలు 114 రూపాయల లాభంలో రూ.29,649గా ఉన్నాయి.

Advertisement
Advertisement