ఫ్లాట్‌గా ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్లు | Sakshi
Sakshi News home page

ఫ్లాట్‌గా ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్లు

Published Wed, Aug 8 2018 9:46 AM

Sensex Flat, Nifty Around 11400 - Sakshi

ముంబై : దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో 17 పాయింట్లు మాత్రమే లాభపడిన సెన్సెక్స్‌, ప్రస్తుతం 12 పాయింట్ల నష్టంలో 37,654 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 5 పాయింట్ల నష్టంలో 11,384 వద్ద కొనసాగుతోంది. ప్రారంభంలో మెటల్స్‌, ఇన్‌ఫ్రా, ఎనర్జీ, పీఎస్‌యూ బ్యాంక్‌లు లాభాలను నమోదు చేశాయి.

టాటా స్టీల్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, వేదంత, టాటా మోటార్స్‌, ఎస్‌ఆర్‌ఎఫ్‌, ఐనాక్స్‌ విండ్‌ టాప్‌ గెయినర్లుగా నిలువగా.. సిప్లా, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, లుపిన్‌, విప్రో, అదానీ ఎంటర్‌ప్రైజస్‌ ఎక్కువగా నష్టపోతున్నాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ ఫ్లాట్‌గా ఎంట్రీ ఇచ్చి, లాభాల్లో ట్రేడవుతోంది. 68.66 వద్ద ప్రారంభమైన రూపాయి విలువ, కాస్త బలపడి 68.61 వద్ద లాభాల్లో కొనసాగుతోంది.

Advertisement
Advertisement