రెనో క్విడ్‌ కొత్త వేరియంట్‌ | Reno Quid is new variant | Sakshi
Sakshi News home page

రెనో క్విడ్‌ కొత్త వేరియంట్‌

Jan 6 2018 1:30 AM | Updated on Jan 6 2018 12:25 PM

Reno Quid is new variant - Sakshi

న్యూఢిల్లీ: వాహన తయారీ కంపెనీ ‘రెనో ఇండియా’ తాజాగా తన ప్రముఖ చిన్న కారు ‘క్విడ్‌’లో కొత్త వేరియంట్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర శ్రేణి రూ.2.67 లక్షలు – రూ.3.87 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్‌ ఢిల్లీ) ఉంది. ఈ కొత్త 2018 ఎడిషన్‌లో రివర్స్‌ పార్కింగ్‌ సెన్సర్స్‌ సహా పది కొత్త ఫీచర్లను పొందుపరిచినట్లు కం పెనీ తెలిపింది.

ఇది 0.8 లీటరు, 1.0 లీటర్‌ ఇంజిన్‌ సామర్థ్యంతో కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఇందులో డిజిటల్‌ ఇన్‌స్ట్రూమెంట్‌ క్లస్టర్, వన్‌టచ్‌ లేన్‌ చేంజ్‌ ఇండికేటర్, రేడియో స్పీడ్‌ డిపెండెంట్‌ వాల్యూమ్‌ కంట్రోల్‌ వంటి పలు ప్రత్యేకతలున్నాయని తెలిపింది.    

Advertisement
 
Advertisement
Advertisement