పేటీఎం మాల్‌ సూపర్‌ క్యాష్‌బ్యాక్‌ సేల్‌ | Paytm Mall has now announced the launch of its Super Cashback Sale | Sakshi
Sakshi News home page

పేటీఎం మాల్‌ సూపర్‌ క్యాష్‌బ్యాక్‌ సేల్‌

Oct 5 2017 4:24 PM | Updated on Oct 5 2017 4:26 PM

Paytm Mall has now announced the launch of its Super Cashback Sale

సాక్షి, న్యూఢిల్లీ: ఈ-కామర్స్‌ కంపెనీలు కొత్త కొత్త సేల్స్‌తో కస్టమర్లను మనసులను చూరగొంటున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌, స్నాప్‌డీల్‌తోపాటు పేటీఎం మాల్‌ కూడా సూపర్‌ క్యాష్‌బ్యాక్‌ సేల్‌తో వినియోగదారుల మందుకు వచ్చింది. ఈ క్యాష్‌బ్యాక్‌ సేల్‌ కింద వినియోగదారులకు 100 శాతం క్యాష్‌బ్యాక్‌, ఉచిత షిప్పింగ్‌తో పాటు మరిన్ని డీల్స్‌ అందిస్తున్నట్టు పేటీఎం మాల్‌ చెప్పింది.  అన్ని గ్రోసరీ వస్తువులపైనా ఈ క్యాష్‌బ్యాక్‌ సేల్‌ను పేటీఎం మాల్‌ లాంచ్‌ చేసింది. సేల్‌లో భాగంగా కస్టమర్లకు క్యాష్‌బ్యాక్‌ రూపంలో రూ.2500ను అందిస్తోంది. అంతేకాక కనీసం 10 నిత్యావసర వస్తువులు లేదా అంతకంటే ఎక్కువ వాటిపై ఉచిత షిప్పింగ్‌ను ఇది ఆఫర్‌ చేస్తోంది. పేటీఎం మాల్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న ఈ సేల్‌, నేటి సాయంత్రంతో ముగియనుంది.

బ్యూటీ, మేకప్‌, గ్రూమింగ్‌ అండ్‌ సేవింగ్‌, డైపర్స్‌, బేబీకేర్‌, లాండ్రి అండ్‌ డిటర్జెంట్లు, హోమ్‌ కేర్‌, ఫుడ్‌వంటి పలు కేటగిరీ యాక్ససరీస్‌, ఉత్పత్తులు ఈ సూపర్‌ ​క్యాష్‌బ్యాక్‌ సేల్‌లో ప్రధానంగా ఉన్నాయి. ఆకర్షణీయమైన క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లతో మ్యాగీ, పతంజలి, మాగి, పతంజలి,హార్లిక్స్, ఏరియల్, సర్ఫ్ ఎక్సెల్, మామి పోకో, లక్మే, లోరియల్‌ వంటి వాటిని ఒకే గూటికి కిందకు తెచ్చింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement