హైదరాబాద్‌లో పేటీఎం మాల్‌! | PattyMam Mall in Hyderabad! | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో పేటీఎం మాల్‌!

Jan 9 2018 1:38 AM | Updated on Jan 9 2018 1:38 AM

PattyMam Mall in Hyderabad! - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రముఖ ఈ–కామర్స్‌ సంస్థ పేటీఎం.. హైదరాబాద్‌లో పేటీఎం మాల్‌ ప్రచారం కోసం రూ.50 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం నగరంలో వెయ్యి బ్రాండ్లతో ఒప్పందం చేసుకున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. బజాజ్‌ ఎలక్ట్రానిక్స్, సెంట్రో, చందనా బ్రదర్స్‌ వంటివి ఇందులో ఉన్నాయి.

ఈనెల 5–17 వరకు షాపింగ్‌ ఫెస్టివల్‌ను నిర్వహిస్తోంది. అప్లయెన్స్, స్మార్ట్‌ఫోన్లు, అపెరల్స్‌ వంటి ఉత్పత్తులపై 80 శాతం డిస్కౌంట్స్, 100 శాతం క్యాష్‌ బ్యాక్‌ ఇస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది. ఈనెల 12న నిజాం గ్రౌండ్స్‌లో హైదరాబాద్‌ కార్నివాల్‌ను నిర్వహించన్నట్లు తెలిపింది. ఇందులో 30కి పైగా టాప్‌ బ్రాండ్స్‌ పాల్గొంటాయని పేర్కొంది.


 

Advertisement
 
Advertisement
Advertisement