కొత్త ఐఫోన్ ఆర్డర్లు అదిరే! | New iPhone orders nice | Sakshi
Sakshi News home page

కొత్త ఐఫోన్ ఆర్డర్లు అదిరే!

Sep 15 2015 12:34 AM | Updated on Aug 20 2018 2:58 PM

కొత్త ఐఫోన్ ఆర్డర్లు అదిరే! - Sakshi

కొత్త ఐఫోన్ ఆర్డర్లు అదిరే!

కొత్త ఐఫోన్(6ఎస్, 6ఎస్ ప్లస్)కు ముందస్తు ఆర్డర్లు కళ్లు చెదిరే స్థాయిలో వస్తున్నాయని యాపిల్ కంపెనీ తెలిపింది...

శాన్‌ఫ్రాన్సికో: కొత్త ఐఫోన్(6ఎస్, 6ఎస్ ప్లస్)కు ముందస్తు ఆర్డర్లు కళ్లు చెదిరే స్థాయిలో వస్తున్నాయని యాపిల్ కంపెనీ తెలిపింది. గతేడాది కొత్త హ్యాండ్‌సెట్స్‌కు వచ్చిన ముందస్తు ఆర్డర్ల (తొలివారం 10 మిలియన్ యూనిట్లు) రికార్డును తాజా ఐఫోన్ మోడల్ తలదన్నే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఈ రెండు మొబైల్స్‌కు ప్రపంచవ్యాప్తంగా అనూహ్య స్పందన వస్తోందని తెలిపింది. కాగా, 12 దేశాల్లో ఈ నెల 25న ఈ కొత్త ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. ఇక భారత్‌లో అక్టోబర్ 27న ఐఫోన్ 6ఎస్, 6ఎస్ ప్లస్‌లు విడుదల అవుతాయని అంచనా.

Advertisement
 
Advertisement
Advertisement