ఏడు ఐపీఎల్‌ జట్లకు అనుబంధ స్పాన్సర్‌గా జియో | Jio to be co sponsorer to seven IPL teams | Sakshi
Sakshi News home page

ఏడు ఐపీఎల్‌ జట్లకు అనుబంధ స్పాన్సర్‌గా జియో

Apr 11 2017 2:49 PM | Updated on Sep 5 2017 8:32 AM

ఏడు ఐపీఎల్‌ జట్లకు అనుబంధ స్పాన్సర్‌గా జియో

ఏడు ఐపీఎల్‌ జట్లకు అనుబంధ స్పాన్సర్‌గా జియో

ప్రస్తుత ఐపీఎల్ -10 సీజన్ లో ఆడుతున్న 8 జట్లలో ఏడు జట్లకు జియో అనుబంధ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది.

ప్రస్తుత ఐపీఎల్ -10 సీజన్ లో ఆడుతున్న 8 జట్లలో ఏడు జట్లకు జియో అనుబంధ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, గుజరాత్ లయన్స్, రైజింగ్ పుణె సూపర్ జెయింట్, ఢిల్లీ డేర్ డెవిల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లతో జియో ఒప్పందం చేసుకుంది.

జియో నెట్ హైస్పీడ్ వై-ఫై సేవలు
హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఐపీఎల్‌ మ్యాచ్ లకు రిలయన్స్ జియో తమ హై-స్పీడ్, వై-ఫై ఇంటర్నెట్ సేవలను జియో నెట్ ద్వారా అందిస్తోంది. రిలయన్స్ జియో ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్ కోసం తమ జియో నెట్ వై-ఫై తో స్టేడియం మొత్తం కవర్ చేసింది. ఈ సేవల కోసం, ప్రేక్షలకు కావలసింది ఒక స్మార్ట్ ఫోన్ మాత్రమే. వై-ఫై కి కనెక్ట్ అయిన తరువాత, జియో నెట్ హోం పేజీలో ఇచ్చిన మొబైల్ నంబరుకి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్‌ చేయగానే వై-ఫై కనెక్ట్ అవుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement