ఏ ఆస్పత్రిలో.. చికిత్స ఖర్చులు ఎంత? | ICICI Lombard eyes 1 lakh feedbacks on new platform | Sakshi
Sakshi News home page

ఏ ఆస్పత్రిలో.. చికిత్స ఖర్చులు ఎంత?

Jun 30 2016 1:18 AM | Updated on Sep 19 2018 8:46 PM

ఏ ఆస్పత్రిలో.. చికిత్స ఖర్చులు ఎంత? - Sakshi

ఏ ఆస్పత్రిలో.. చికిత్స ఖర్చులు ఎంత?

బీమా సంస్థ ఐసీఐసీఐ లంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ తాజాగా హెల్త్ అడ్వైజర్ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెచ్చింది.

పోల్చి చూపే ఐసీఐసీఐ లంబార్డ్ హెల్త్ అడ్వైజర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బీమా సంస్థ ఐసీఐసీఐ లంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ తాజాగా హెల్త్ అడ్వైజర్ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెచ్చింది. సమీపంలోని ఆస్పత్రులు, చికిత్స నాణ్యత, మౌలిక సదుపాయాలు, వ్యయాలు తదితర వాటిని పోల్చి చూసుకునేందుకు ఇది తోడ్పడుతుంది. హైదరాబాద్, చెన్నైతో పాటు పది నగరాల్లోని సుమారు 1,000 పైగా ఆస్పత్రుల వివరాలు ఈ పోర్టల్‌లో అందుబాటులో ఉన్నాయని ఐసీఐసీఐ లంబార్డ్ హెడ్ (హెల్త్ అండర్‌రైటింగ్ అండ్ క్లెయిమ్స్ విభాగం) అమిత్ భండారీ బుధవారమిక్కడ వెల్లడించారు. హైదరాబాద్‌లో 140 ఆస్పత్రులు ఈ జాబితాలో ఉన్నాయని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement