రూ.800 కోట్లతో హెచ్‌ఎంఎస్‌ఐ విస్తరణ!! | HMSI expansion with Rs 800 crore | Sakshi
Sakshi News home page

రూ.800 కోట్లతో హెచ్‌ఎంఎస్‌ఐ విస్తరణ!!

Apr 11 2018 1:00 AM | Updated on Apr 11 2018 1:00 AM

HMSI expansion with Rs 800 crore - Sakshi

న్యూఢిల్లీ: హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) కార్యకలాపాల విస్తరణపై దృష్టి కేంద్రీకరించింది. ఇందులో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.800 కోట్లమేర ఇన్వెస్ట్‌ చేయాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. 2017–18లో 22 శాతం వృద్ధి నమోదు చేసిన కంపెనీ 2018–19లోనూ రెండంకెల వృద్ధిని లక్ష్యంగా నిర్దేశించుకుంది.

‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.800 కోట్లు ఇన్వెస్ట్‌ చేయాలని భావిస్తున్నాం. వరుసగా మూడో ఏడాది కూడా రెండంకెల వృద్ధిని సాధించాలని నిర్ణయించుకున్నాం’ అని హెచ్‌ఎంఎస్‌ఐ ప్రెసిడెంట్, సీఈవో మినోరు కటో తెలిపారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement