టెక్‌ స్టార్టప్స్‌లో  ఫేస్‌బుక్‌ పెట్టుబడులు | Facebook Investment In Tech Startups | Sakshi
Sakshi News home page

టెక్‌ స్టార్టప్స్‌లో  ఫేస్‌బుక్‌ పెట్టుబడులు

Sep 28 2019 4:52 AM | Updated on Sep 28 2019 4:52 AM

Facebook Investment In Tech Startups - Sakshi

న్యూఢిల్లీ: సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌.. దేశీ టెక్నాలజీ స్టార్టప్స్‌లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు వ్యూహాలను రచిస్తోంది. తాజాగా సోషల్‌ కామర్స్‌ ప్లాట్‌ఫాం ‘మీషో’లో తన తొలి పెట్టుబడిని పెట్టిన ఈ సంస్థ.. మరిన్ని స్టార్టప్స్‌లో పెట్టుబడుల పరంపరను కొనసాగించేందుకు సిద్ధమైంది. శుక్రవారం కేరళలో జరిగిన ఆసియాలోని అతిపెద్ద స్టార్టప్స్‌ సమావేశంలో మాట్లాడిన   భారత కార్యకలాపాల మేనేజింగ్‌ డైరెక్టర్, వైస్‌ ప్రెసిడెంట్‌ అజిత్‌ మోహన్, టెక్నాలజీ సంబంధిత అంకుర సంస్థల్లో ఇన్వెస్ట్‌ చేసేందుకు సుముఖంగా ఉన్నామని ప్రకటించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement