ఈజీ లైఫ్‌ పర్సనల్‌ ఫైనాన్స్‌ యాప్‌ | Easy Life Personal Finance App | Sakshi
Sakshi News home page

ఈజీ లైఫ్‌ పర్సనల్‌ ఫైనాన్స్‌ యాప్‌

Feb 6 2017 2:09 AM | Updated on Sep 5 2017 2:58 AM

ఈజీ లైఫ్‌ పర్సనల్‌ ఫైనాన్స్‌ యాప్‌

ఈజీ లైఫ్‌ పర్సనల్‌ ఫైనాన్స్‌ యాప్‌

పర్సనల్‌ ఫైనాన్స్‌కి సంబంధించిన ఈజీ లైఫ్‌ యాప్‌కి గూగుల్‌ ప్లేస్టోర్‌లో నాలుగున్నర రేటింగ్‌ ఉంది. పెట్టుబడులు, బ్యాంక్‌ ఖాతాలు, క్రెడిట్‌ కార్డులు..

పర్సనల్‌ ఫైనాన్స్‌కి సంబంధించిన ఈజీ లైఫ్‌ యాప్‌కి గూగుల్‌ ప్లేస్టోర్‌లో నాలుగున్నర రేటింగ్‌ ఉంది. పెట్టుబడులు, బ్యాంక్‌ ఖాతాలు, క్రెడిట్‌ కార్డులు.. ఇలా అన్నింటిని సజావుగా నిర్వహించుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది.

మరిన్ని అంశాలు చూస్తే..
ఇందులో షేర్లు, మ్యూచువల్‌ ఫండ్స్, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, బాండ్లు/డిబెంచర్లు, బీమా పాలసీలు మొదలైన వాటి వివరాలు పొందుపర్చుకోవచ్చు.  ఉదాహరణకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు తీసుకుంటే ఎఫ్‌డీ ఎప్పుడు ప్రారంభమైంది...

మెచ్యూరిటీ తేదీ ఎప్పుడు, ఎంత వస్తుంది తదితర అంశాలు.. అలాగే ఏ షేర్లు ఎంతకి, ఎప్పుడెప్పుడు కొన్నారు.. సగటు రేటెంత మొదలైన వివరాలన్నీ చిటికెలో లభించేలా ఇందులో భద్రపర్చుకోవచ్చు.

వీటితో పాటు ఈఎంఐ కాల్‌క్యులేటర్, డౌన్‌లోడ్‌ చేసుకోతగ్గ లైవ్‌ కోట్స్‌ లాంటివి ఇందులోని ప్రత్యేక ఫీచర్స్‌.

ప్రారంభంలో ముప్పై రోజుల పాటు ఉచితంగా దీన్ని ట్రయల్‌ ప్రాతిపదికన ఉపయోగించవచ్చు.

ప్రమోషనల్‌ ఆఫర్‌ కింద అయిదుగురినుంచి ఇరవైమంది దాకా ఉపయోగించుకునే లైసెన్సుకు వార్షికంగా రూ.3 వేల నుంచి రూ.6 వేల దాకా సబ్‌స్క్రిప్షన్‌ ఫీజు ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement