న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరి-మార్చి(క్యూ4) కాలానికి కెయిర్న్ ఇండియా రూ. 3,035 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది(2012-13) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 2,564 కోట్లతో పోలిస్తే ఇది 18% వృద్ధి. ఇదే కాలానికి అమ్మకాలు కూడా 16% పెరిగి రూ. 5,049 కోట్లకు చేరాయి. వాటాదారులకు ఒక్కో షేరుకి రూ. 6.50 తుది డివిడెండ్‌ను చెల్లించనుంది. ఈ కాలంలో రాజస్తాన్‌తోపాటు మరో రెండు ఇతర ఆయిల్ క్షేత్రాల నుంచి సగటున రోజుకి 2,24,429 బ్యారళ్లను ఉత్పత్తి చేసింది. ఇది 11% అధికం. విడిగా రాజస్తాన్ క్షేత్రాల నుంచి ఉత్పత్తి 12% పుంజుకుని రోజుకి 1,89,304 బ్యారళ్లకు చేరింది.
అదనపు నిల్వలు జత
నాలుగేళ్ల విరామం తరువాత గతేడాది బార్మర్ బేసిన్లో వెలికితీత కార్యక్రమాలను మొదలుపెట్టడంతో ఈ ఏడాది 1 బిలియన్ బ్యారళ్ల చమురు నిల్వలను సమకూర్చుకోగలిగినట్లు కంపెనీ సీఈవో ఎలాంగో.పి చెప్పారు. ఇవి ప్రస్తుత 4.2 బ్యారళ్లకు అదనంకాగా, కంపెనీ వద్ద నగదు, తత్సమాన నిల్వల విలువ రూ. 13,707 కోట్లకు చేరింది.
నిధులను షేర్ల బైబ్యాక్, డివిడెండ్ చెల్లింపు తదితరాలకు వినియోగించే అవకాశముంది. మార్చి నెలలో సగటున రోజుకి 2,00,000 బ్యారళ్ల ఉత్పత్తిని సాధించడమేకాకుండా, క్యూ4లో 20 కోట్ల బ్యారళ్ల ఆయిల్‌ను ఉత్పత్తి చేయగలిగినట్లు వివరించారు. ఇక పూర్తి ఏడాదికి(2013-14) కంపెనీ నికర లాభం 4%పైగా పెరిగి రూ. 12,432 కోట్లకు చేరగా, అమ్మకాలు రూ. 17,524 కోట్ల నుంచి రూ. 18,762 కోట్లకు ఎగశాయి.
ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో కెయిర్న్ షేరు 3.3% తగ్గి రూ. 352 వద్ద ముగిసింది.
కెయిర్న్ ఇండియా లాభం 18% వృద్ధి
Published Thu, Apr 24 2014 1:18 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలి
కేసులను సత్వరమే పరిష్కరించాలి
రుణమాఫీకి కసరత్తు !
స్కూల్ యూనిఫాం తయారీకి సిద్ధం
రోడ్డు విస్తరణ పనుల పరిశీలన
ప్రమాదాలకు చెక్!
యాదాద్రిలో ఊంజలి సేవ
రేపు జిల్లా స్థాయి చెస్ పోటీలు
సేంద్రియ సాగుతో ప్రయోజనాలు
సిజేరియన్లు తగ్గించకపోతే ఆస్పత్రులు సీజ్
తప్పక చదవండి
- తిరుమల: నేడు ఆగష్టు ఆర్జితసేవా టికెట్ల విడుదల
- Naveen Patnaik: రాజకీయ పర్యాటకుల ప్రభావం సున్నా
- జీ ఎంటర్టైన్మెంట్ లాభం రూ. 13 కోట్లు
- నేడు ఈఏపీ సెట్ ఫలితాలు
- ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి మాకు భార్యాపిల్లలు లేరా?
- Global Burden of Disease: సగటు జీవితకాలం పైపైకి..
- Delhi liquor scam: నిందితుల జాబితాలో ఆప్, కేజ్రీవాల్
- ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు
- త్వరలో గ్రూప్–4 ఎంపిక జాబితా
- Association for Democratic Reforms: ఆస్తుల్లో టాప్ జిందాల్
Advertisement