అవాన్‌ మోటార్స్‌ నుంచి ఎలక్ర్టిక్‌ వాహనాలు | Avan Motors Brings Efficient Range Of Electric Scooters | Sakshi
Sakshi News home page

అవాన్‌ మోటార్స్‌ నుంచి ఎలక్ర్టిక్‌ వాహనాలు

Feb 21 2019 6:46 PM | Updated on Feb 21 2019 6:46 PM

Avan Motors Brings Efficient Range Of Electric Scooters - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఎలక్ర్టిక్‌ వాహనాల తయారీలో ముందున్న అవాన్‌ మోటార్స్‌ ఈ రంగంలో మరిన్ని నూతన వాహనాలు ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. గత ఏడాది సెప్టెంబర్‌లో జెరో ప్లస్‌ను ప్రారంభించిన కంపెనీ ఈ వాహనానికి వచ్చిన స్పందనతో మరిన్ని ఈ తరహా ఎలక్ర్టిక్‌ స్కూటర్లు, వాహనాలను ప్రవేశపెట్టేందుకు యోచిస్తోంది.

జెరో ప్లస్‌ స్కూటర్లకు వినియోగదారుల నుంచి మంచి స్పందన లభించిందని, ఒక బ్యాటరీతో 60 కిమీ భారీ మైలేజ్‌ను ఇవ్వడంతో పాటు రూ 47,000కే అందుబాటులో ఉండటం దీని ప్రత్యేకతలని అవాన్‌ మోటార్స్‌ తెలిపింది. ఈ వాహనం విజయవంతం కావడంతో మరిన్ని ఎలక్ర్టిక్‌ వాహనాలను ప్రవేశపెట్టేందుకు సంసిద్ధంగా ఉన్నామని కంపెనీ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ హెడ్‌ పంకజ్‌ తివారీ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement