అమెజాన్ ఆపిల్‌ డేస్‌ సేల్‌ : తగ్గింపు ధరలు | Amazon Apple Days Sale Begins Midnight  | Sakshi
Sakshi News home page

అమెజాన్ ఆపిల్‌ డేస్‌ సేల్‌ : తగ్గింపు ధరలు

Jul 18 2020 2:47 PM | Updated on Jul 18 2020 3:44 PM

Amazon Apple Days Sale Begins Midnight  - Sakshi

సాక్షి, ముంబై: ప్రముఖ ఆన్‌లైన్‌ సంస్థ అమెజాన్‌ ఆపిల్ డేస్ సేల్ ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఆపిల్‌ డేస్‌ అమ్మకాలు ఈ రోజు(శనివారం) అర్థరాత్రినుంచి ప్రారంభమై జూలై 25 వరకు కొనసాగుతుంది.  ఆపిల్‌ ఐఫోన్ 11 సిరీస్‌తో పాటు ఐఫోన్ 8 ప్లస్ వంటి ఫోన్‌లపై తగ్గింపు ధరలను అందించనుంది. అలాగే ఆపిల్ ఐప్యాడ్ సిరీస్, ఆపిల్ వాచ్ సిరీస్‌పై కూడా డిస్కౌంట్లను ఆఫర్‌ చేయనుంది. దీంతోపాటు హెచ్‌డీఎఫ్‌సీ కార్డు ద్వారా జరిపే కొనుగోళ్లపై అదనపు తగ్గింపు,  నో కాస్ట్‌ ఈఎంఐ లాంటి సదుపాయాలను కూడా అందిస్తుంది.

అమెజాన్‌లో ఆఫర్లు
ఐఫోన్ 11 (64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌) 62,900 రూపాయలుకే లభ్యంకానుంది.  అసలు ధర 68,300 రూపాయలతో పోలిస్తే ఈసేల్‌లో 5,400 రూపాయలు తగ్గింపు.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డెబిట్  క్రెడిట్ కార్డ్  ద్వారా  ఐఫోన్ 11 ప్రో  ఐఫోన్ 11 ప్రో మాక్స్  కొనుగోళ్లపై 4వేల రూపాయలు డిస్కౌంట్‌. 
ఐఫోన్ 8 ప్లస్ 64 జీబీ ధర  41,500 రూపాయలు. దీంతో పాటు ఐఫోన్ 7 సిరీస్‌ ఫోన్లపై కూడా భారీ డిస్కౌంట్లు అందించనుంది. 

Advertisement
 
Advertisement
Advertisement