గ్రహం అనుగ్రహం (19-07-2020) | Daily Horoscope In Telugu (19-07-2020) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (19-07-2020)

Jul 19 2020 7:58 AM | Updated on Jul 19 2020 8:26 AM

Daily Horoscope In Telugu (19-07-2020) - Sakshi

శ్రీశార్వరినామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి బ.చతుర్దశి రా.11.14 వరకు, తదుపరి అమావాస్య, నక్షత్రం ఆరుద్ర రా.9.36 వరకు, తదుపరి పునర్వసు, వర్జ్యం ఉ.5.30 నుంచి 7.10 వరకు, దుర్ముహూర్తం సా.4.51 నుంచి 5.42 వరకు, అమృతఘడియలు....ఉ.11.19 నుంచి 12.55 వరకు

సూర్యోదయం 5.38
సూర్యాస్తమయం 6.34
రాహుకాలం సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం ప.12.00 నుంచి 1.30 వరకు

గ్రహఫలం
మేషం: ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు.

వృషభం: ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమ పెరుగుతుంది. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

మిథునం: కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు విశేష కీర్తి.

కర్కాటకం: పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

సింహం: చర్చలు ఫలిస్తాయి. ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కన్య: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. సంఘంలో ఆదరణ. వాహనయోగం. కొన్ని వివాదాలు పరిష్కారం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

తుల: ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. కుటుంబసమస్యలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.

వృశ్చికం: ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. నిర్ణయాలలో మార్పులు. దైవదర్శనాలు. బంధువులతో విభేదాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.

ధనుస్సు: శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. పనుల్లో విజయం. భూలాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

మకరం: శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. వివాదాల పరిష్కారం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు.

కుంభం: పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. వ్యాపారాలు నిరుత్సాహం. ఉద్యోగులకు బదిలీలు.

మీనం: వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో తగాదాలు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement